Babar Azam: పీసీబీ షాక్ ఇచ్చిన బాబర్.. కెప్టెన్ పదవికి రాజీనామా.. కొత్త సారథిగా ఎవరంటే?
Babar Azam Steps As Pakistan Captain: బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ 2023లో చాలా పేలవంగా ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. బాబర్ ఆజం మూడు ఫామ్‌ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

Babar Azam Steps As Pakistan Captain: బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ 2023లో చాలా పేలవంగా ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. బాబర్ ఆజం మూడు ఫామ్‌ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. బాబర్ తర్వాత టెస్టు క్రికెట్‌లో షాన్ మసూద్, టీ20 ఇంటర్నేషనల్‌లో షాహీన్ షా ఆఫ్రిది కెప్టెన్ రేసులో ముందంజలో ఉన్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయాన్ని బాబర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
‘ఈరోజు నేను మూడు ఫార్మాట్లలో పాక్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం, కానీ, ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను”అని బాబర్ ఆజం ఎక్స్‌లో రాసుకొచ్చాడు.
“నేను మూడు ఫార్మాట్లలో ఒక ఆటగాడిగా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కి, జట్టుకు మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను, ” అంటూ ట్వీట్ చేశాడు.
— Babar Azam (@babarazam258) November 15, 2023
భారత్‌లో జరుగుతున్న ODI ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ టీం తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే కెప్టెన్ బాబర్ కూడా పేలవ ఫాంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో పాక్ జట్టు నాకౌట్‌లను చేయడంలో విఫలమైంది. తొమ్మిది మ్యాచ్‌లలో ఎనిమిది పాయింట్లతో ఐదవ స్థానంలో నిలిచింది.
“వైట్ బాల్ ఫార్మాట్‌లో నంబర్ వన్‌కు చేరుకోవడం కోచ్, ఆటగాళ్ళు, టీమ్ మేనేజ్‌మెంట్ సమిష్టి కృషితోనే సాధ్యమైంది. అయితే ఈ ప్రయాణంలో వారి తిరుగులేని మద్దతు కోసం ఉద్వేగభరితమైన పాకిస్తానీ అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ పేర్కొన్నాడు.
“నేను ఒక ఆటగాడిగా మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ తరపున ఆడటం కొనసాగిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్‌కి, జట్టుకు మద్దతునిస్తూనే ఉంటాను. ఈ విశేషమైన బాధ్యత కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ తెలిపాడు.
బాబర్ 20 టెస్టు మ్యాచ్‌లకు పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే, 43 ODI, 71 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్తాన్‌కు నాయకత్వం వహించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








