రెండేళ్ల కెరీర్‌లో 47 వికెట్లు.. ఆటగాడిగా ఫెయిల్యూర్.. కోచ్‌గా విజయం.. ఎవరో తెలుసా.?

ప్రపంచ క్రికెట్‌కు ఆస్ట్రేలియా అనేక అద్భుతమైన ఆటగాళ్లను అందించింది. కొందరి కెరీర్ సుదీర్ఘమైనది కాగా.. మరికొందరి కెరీర్..

రెండేళ్ల కెరీర్‌లో 47 వికెట్లు.. ఆటగాడిగా ఫెయిల్యూర్.. కోచ్‌గా విజయం.. ఎవరో తెలుసా.?
Cricketer

ప్రపంచ క్రికెట్‌కు ఆస్ట్రేలియా అనేక అద్భుతమైన ఆటగాళ్లను అందించింది. కొందరి కెరీర్ సుదీర్ఘమైనది కాగా.. మరికొందరి కెరీర్ మధ్యలోనే బ్రేక్ పడింది. ఈ రెండో కోవకు చెందిన ఆటగాడు వేన్ క్లార్క్. ఈ ప్లేయర్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే మాత్రం అతడు నెలకొల్పిన రికార్డులు కోకొల్లలు. ఇవాళ ఈ ఆటగాడి పుట్టినరోజు. సెప్టెంబర్ 19 న 1953లో జన్మించిన ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ వేన్ క్లార్క్ నేటితో 68 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో అతడి కెరీర్, రికార్డుల గురించి మాట్లాడుకుందాం..

వేన్ క్లార్క్ క్రికెట్ కెరీర్ మొత్తం 11 సంవత్సరాలు. అందులో ఇంటర్నేషనల్ కెరీర్ 2 ఏళ్లు మాత్రమే. అతడు కేవలం 12 మ్యాచ్‌లకు మాత్రమే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. 10 టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డేలు ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాపై అరంగేట్రం చేసిన వేన్ క్లార్క్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు.

అరంగేట్ర సిరీస్‌లో అద్భుత ప్రదర్శన..

భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి వేన్ క్లార్క్ అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులోనే వేన్ క్లార్క్ 8 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో 101 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు. ఇలా మొత్తం ఆ టెస్ట్ సిరీస్‌లో క్లార్క్ ఏకంగా 28 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ రికార్డు 42 సంవత్సరాల వరకు చెక్కు చెదరలేదు. 1977–78లో క్లార్క్ తన అరంగేట్ర సిరీస్ ఆడగా.. టీమిండియాకు తన అసాధారణమైన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. అప్పట్లో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డును 2019లో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో పాట్ కమిన్స్ బ్రేక్ చేశాడు.

12 అంతర్జాతీయ మ్యాచ్‌లు…

భారత్‌తో ఆడిన 5 టెస్టుల సిరీస్ తర్వాత.. క్లార్క్ మరో 5 టెస్టులు కూడా ఆడాడు. 1979లో పాకిస్థాన్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన క్లార్క్.. మొత్తం 10 టెస్టులకు గానూ 44 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 2 వన్డేల్లో 3 వికెట్లు పడగొట్టాడు. కాగా, రిటైర్మెంట్ అనంతరం 2006-07 మధ్య వెస్ట్ ఆస్ట్రేలియాకు వేన్ క్లార్క్ కోచ్‌గా వ్యవహరించాడు.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu