ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ యూఏఈలో ఆదివారం 19 సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఈ సెకండ్ ఫేజ్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఆదివారం నుండి దుబాయ్, షార్జా, అబుదాబి క్రికెట్ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ పలు రికార్డులను కొల్లగొట్టనున్నాడు.