IPL 2021: షార్జాలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి నో ఎంట్రీ.. RT-PCR టెస్ట్‌ రిజల్ట్ కచ్చితం..

IPL 2021: యూఏఈలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 రెండో దశ కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మార్చిలో ప్రారంభమైన ఈ లీగ్ వాయిదా తర్వాత మళ్లీ ప్రారంభం

IPL 2021: షార్జాలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి నో ఎంట్రీ.. RT-PCR టెస్ట్‌ రిజల్ట్ కచ్చితం..
Ipl
Follow us
uppula Raju

|

Updated on: Sep 19, 2021 | 1:33 PM

IPL 2021: యూఏఈలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 రెండో దశ కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మార్చిలో ప్రారంభమైన ఈ లీగ్ వాయిదా తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. భారతదేశానికి బదులుగా UAE లో జరగుతుంది. ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే చాలా కాలం తర్వాత అభిమానులు ఐపిఎల్ మ్యాచ్ చూడటానికి అనుమతి పొందారు. అయితే దీని కోసం స్టేడియాలలో విభిన్న నియమాలు అమలు చేస్తున్నారు. రెండో దశలో కొన్ని మ్యాచ్‌లు షార్జా స్టేడియంలో జరగాల్సి ఉంది.

అయితే 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభిమానులకు ఈ స్టేడియంలో ఎంట్రీ లేదు. ఇది కాకుండా స్టేడియంలోకి ప్రవేశించేటప్పుడు అభిమానుల ఉష్ణోగ్రత తనిఖీ చేస్తారు. అంతేకాదు టీకా గురించిన సమాచారం దుబాయ్ స్టేడియంలో ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్‌ నియమాలు వివిధ స్టేడియాలలో వివిధ రకాలుగా ఉన్నాయి. ఐపీఎల్ రెండో దశ మ్యాచ్‌లు దుబాయ్, అబుదాబి, షార్జాలో జరుగుతాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియానికి వెళ్లడానికి అభిమానులు RT PCR రిజల్ట్‌ని చూపించాల్సిన అవసరం లేదు.

12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులందరూ రెండు డోసుల టీకా తీసుకున్నట్లు రుజువు చూపించాలి. 12 ఏళ్లలోపు పిల్లలకు ఇది అవసరం లేదు. స్టేడియంలో కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. షార్జా స్టేడియంలో నియమాలు కొన్ని కఠినంగా ఉన్నాయి.16 ఏళ్లలోపు అభిమానులకు షార్జాలో ఎంట్రీ లేదు. టీకా నివేదికతో పాటు ఇక్కడకు వచ్చే సందర్శకులు 48 గంటల ముందు RT-PCR రిజల్ట్‌ని చూపించాల్సి ఉంటుంది. ఇది కాకుండా UAE ఎల్ హోస్న్ యాప్‌లో కూడా గ్రీన్ స్టేటస్ తప్పనిసరి. 16 ఏళ్లు పైబడిన అభిమానులు కూడా RTPCR నివేదికను చూపించాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభిమానులు తప్పనిసరిగా పెద్దవారితో ఉండాలి. ఒకసారి స్టేడియం నుంచి వెళ్లిపోతే అతను మళ్లీ లోపలికి రాలేడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..

SIIMA Awards 2021: తరలివచ్చిన తారాలోకం.. మహేష్ బాబు సినిమాకు అవార్డుల పంట..

Sonu Sood: సోనూ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు.. ఐటీ అధికారులు ఏం తేల్చారంటే..?

ఏపీ పరిషత్ ఫైట్ 

ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి