IPL 2021: ధోని 8 సిక్సర్లు కొట్టి ముంబైని హెచ్చరించాడు..! వీడియో చూస్తే అదిరిపోతారంతే..?
IPL 2021: యూఏఈలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 రెండో దశ కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మార్చిలో ప్రారంభమైన ఈ లీగ్ వాయిదా తర్వాత మళ్లీ
IPL 2021: యూఏఈలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 రెండో దశ కోసం అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు . మార్చిలో ప్రారంభమైన ఈ లీగ్.. కరోనా కారణంగా వాయిదా తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. భారతదేశానికి బదులుగా UAE లో జరగుతుంది. మొదటగా ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగనుంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోని వరుసగా 8 సిక్స్‌లు బాది ముంబై ఇండియన్స్‌కి హెచ్చరికలు జారీ చేశాడు. అతడు క్రీజులోకి వచ్చిన వెంటనే బ్యాట్‌కి పనిచెప్పాడు.
స్పిన్నర్లు, పేసర్లు అనే తేడాలేకుండా ప్రతి ఒక్క బౌలర్‌పై విరుచుకుపడ్డాడు. బౌండరీలతో పాటుగా 8 సిక్సర్లు కొట్టి అలరించాడు. లాంగ్ ఆన్ మీదుగా చాలా సిక్సర్లు బాదాడు. ఇందులో అతడికి ఇష్టమైన హెలికాప్టర్ షాట్ కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ధోని సిక్సర్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కామెంట్స్, షేర్స్ చేస్తున్నారు. ధోని మునుపటిలా ఆడుతున్నాడని క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు ఇలాగే మ్యాచ్‌లో ఆడితే ముంబై చుక్కలు చూడటం ఖాయమంటున్నారు. ఐపిఎల్ 2021 పోటాపోటీగా ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
దుబాయ్‌లో CSK కి మంచి అవకాశం ఈ రోజు దుబాయ్‌లో ముంబై ఇండియన్స్‌తో చెన్నై తలపడనుంది. ఈ మైదానంలో ముంబై జట్టు కేవలం 3 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఈ మూడు విజయాలు ఒకే జట్టు అంటే ఢిల్లీ క్యాపిటల్స్‌పై నమోదు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఉన్న లక్ష్యం ఏంటంటే ఇండియాలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడం. ఐపిఎల్ 2021 మొదటి దశ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు 5 మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లను సేకరించింది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉంది.
All arealayum Thala…?#WhistlePodu #Yellove ?? @msdhoni pic.twitter.com/Zu85aNrRQj
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) September 18, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Anushka Shetty : మరో విభిన్న పాత్రలో నటించనున్న అందాల అనుష్క.. ఏ మూవీలో అంటే..