ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చెత్త బౌలర్ ఇతడే..! 97 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ సాధించాడు..

Cricket News : కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు వికెట్ సాధించడానికి చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. టీ 20 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు గడిచినా వికెట్ దొరకకపోవచ్చు.

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత చెత్త బౌలర్ ఇతడే..! 97 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ సాధించాడు..
Bowling 5
Follow us
uppula Raju

|

Updated on: Jul 16, 2021 | 10:02 AM

Cricket News : కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు వికెట్ సాధించడానికి చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోంది. టీ 20 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు గడిచినా వికెట్ దొరకకపోవచ్చు. వన్డేల్లో అయితే పది ఓవర్లు బౌలింగ్ చేసిన తరువాత కూడా వికెట్ లభించకపోవచ్చు. అదే సమయంలో, టెస్ట్ క్రికెట్‌లో అయితే వికెట్ కోసం వేచిచూడటం మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక ఆటగాడు ఒక వికెట్ కోసం ఏకంగా 97 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంతేకాదు 281 పరుగులు సమర్పించుకున్నాడు. 584 బంతులను బౌలింగ్ చేశాడు. అతడు ఎవరో కాదు ఆస్ట్రేలియాకు చెందిన జాన్ వార్. ఈ రోజు అతడి పుట్టినరోజు.

జాన్ వార్16 జూలై 1927 న జన్మించాడు. జాన్ మేరీలెబోన్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. అతను ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ జట్టు మిడిల్‌సెక్స్ కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మన్‌గా జాన్ కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. అయితే ప్రధాన పని బౌలింగ్ చేయడం. అయినప్పటికీ అందులో కూడా విజయం సాధించలేదు. కేవలం 1 వికెట్ మాత్రమే సాధించాడు. 584 బంతులు అంటే సుమారు 97 ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత అతనికి ఈ వికెట్ లభించింది. ఇందుకోసం అతను 281 పరుగులు ఖర్చు చేశాడు. అనగా అతని బౌలింగ్ సగటు 281 స్ట్రైక్ రేట్.

344 మ్యాచ్‌ల్లో 956 వికెట్లు.. ఆస్ట్రేలియా తరఫున జాన్‌వార్ 2 టెస్ట్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 1951 జనవరి 5 నుంచి 9 వరకు సిడ్నీలో ఇంగ్లాండ్‌తో అరంగేట్రం చేశాడు. తరువాత 1951 ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్ట్ ఆడాడు. 2 టెస్టుల్లో 1 వికెట్ తీసుకున్న జాన్ వెర్ తన కెరీర్‌లో మొత్తం 344 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను మొత్తం 956 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపించాడు. ఈ సమయంలో ఇన్నింగ్స్‌లో 65 పరుగులకు తొమ్మిది వికెట్ల ప్రదర్శన ఉత్తమమైనది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌లో 35 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అతను మ్యాచ్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనతను 5 సార్లు సాధించాడు.

Encounter : శ్రీనగర్ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదుల హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

kareena kapoor: నెట్టింట వైరల్‌ అవుతోన్న పటౌడీ రాకుమారుల ఫొటోలు.. ఇద్దరు చిన్నారులతో కరీనా.

Fresh Egg : ఉడకపెట్టిన గుడ్డును ఎంత సమయంలో తినాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో