IND vs SL: ఫేస్‌బుక్‌లో భారత్, శ్రీలంక సిరీస్.. ఎలా చూడాలో తెలుసా?

జులై 18 నుంచి టీమిండియా, శ్రీలంకల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ (వన్డే, టీ20) లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌కు సంబంధించిన మ్యాచులను సోనీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనుంది.

IND vs SL: ఫేస్‌బుక్‌లో భారత్, శ్రీలంక సిరీస్.. ఎలా చూడాలో తెలుసా?
Ind vs sl
Follow us
Venkata Chari

|

Updated on: Jul 15, 2021 | 9:47 PM

IND vs SL: జులై 18 నుంచి టీమిండియా, శ్రీలంకల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ (వన్డే, టీ20) లు జరగనున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లొచ్చిన శ్రీలంక సిబ్బందికి కరోనా సోకడంతో.. వన్డే సిరీస్ కాస్తా ఆలస్యంగా ప్రారంభం కానుంది. అసలు జులై 12 నుంచి వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. ఇక తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి సోనీ ఛానెల్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందించనుంది. అయితే, ఈ మేరకు సోనీ ఛానల్ ఫేస్‌బుక్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు భారత్, శ్రీలంక సిరస్‌కు సంబంధించిన హైలెట్స్, వీడియోలు ప్రసారం చేసేందుకే ఫేస్‌బుక్‌ తో టై అయిందని ప్రకటించింది. మూడు వన్డేలు, మూడు టీ20 లకు సంబంధించిన హైలెట్స్, వీడియోలను ఫేస్‌బుక్ వాచ్ ద్వారా చూడవచ్చని సోనీ ఛానెల్ పేర్కొంది.

ఈ ఒప్పందంతో సోషల్ వీడియోల్లో తమ వాటాను మరింత పెంచుకుంటామని ఫేస్‌బుక్ వెల్లడించింది. ప్రస్తుతం ఫేస్ బుక్ వాచ్ మొబైల్, డెస్క్‌టాప్, ఫేస్‌బుక్ టీవీ యాప్‌ల్లో అందుబాటులో ఉంది. మ్యాచ్ హైలెట్లతో పాటు బెస్ట్ వికెట్లు, బెస్ట్ క్యాచ్‌లు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వంటివాటిని ఫేస్ బుక్ వాచ్ ద్వారా చూడవచ్చు. ఈ కంటెంట్‌తో ప్రజలకు మరింత చేరువ కానున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. శిఖర్ ధావన్ నేతృత్వంలోని యంగ్ టీమిండియా.. శ్రీలంకతో జులై 18 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అనంతరం జులై 25 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి.

భారత జట్టు జులై 28, 2012 నుంచి శ్రీలంకలో ఒక్క వన్డేలోనూ ఓడిపోలేదు. శ్రీలంకలో వరుసగా 8 వన్డేల విజయ పరంపరను కొనసాగిస్తోంది టీమిండియా జట్టు. శ్రీలంకలో ఇప్పటి వరకు వరుసగా ఇన్ని వన్డేల్లో ఇతర విజిటింగ్ జట్టు గెలవలేదు. 2017 లో టీమిండియా శ్రీలంక జట్టును 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. యువకులతో కూడిన జట్టుకు ధావన్ నాయకత్వం వహించనున్నాడు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి ప్లేయర్లు శ్రీలంక టూర్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు టీమిండియా జట్టు శ్రీలంకలో 61 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 28 మ్యాచుల్లో గెలవగా, 27 మ్యాచుల్లో ఓడిపోయారు. అలాగే 6 మ్యాచుల్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు శ్రీలంకలో ఎక్కువ మ్యాచులు గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది. ఇతర జట్లేవీ ఇన్ని మ్యాచుల్లో గెలవలేదు.

Also Read:

Westindies vs Australia: భారీ షాట్లు ఆడబోయిు బోల్తాపడ్డావ్‌గా.. అంత అత్యుత్సాహం ఎందుకయ్యా..! విండీస్ దిగ్గజంపై నెటిజన్ల ఆగ్రహం

IND vs SL: అక్కడ 9 ఏళ్లుగా టీమిండియాకు ఎదురులేదు.. ఈ రికార్డును సీనియర్ ప్లేయర్ కొనసాగించేనా?

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కనిపించిన 9 మంది స్టార్ ఆటగాళ్లు వీరే..!

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో