IND vs SL: అక్కడ 9 ఏళ్లుగా టీమిండియాకు ఎదురులేదు.. ఈ రికార్డును సీనియర్ ప్లేయర్ కొనసాగించేనా?

శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లంక ఆటగాళ్లకు కరోనా కారణంగా వన్డే సిరీస్‌ వారం ఆలస్యంగా అంటే జులై 18 నుంచి జరగనుంది. అయితే, లంక పర్యటనలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది.

IND vs SL: అక్కడ 9 ఏళ్లుగా టీమిండియాకు ఎదురులేదు.. ఈ రికార్డును సీనియర్ ప్లేయర్ కొనసాగించేనా?
Shikhar Dhawan Teamindia In Srilanka Tour
Follow us

|

Updated on: Jul 15, 2021 | 6:43 PM

IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లంక ఆటగాళ్లకు కరోనా కారణంగా వన్డే సిరీస్‌ వారం ఆలస్యంగా అంటే జులై 18 నుంచి జరగనుంది. అయితే, లంక పర్యటనలో టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. 2017లో వన్డే సిరీస్‌ను భారత్ 5-0తో వైట్‌వాష్ చేసింది. వచ్చేనెలలో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడేందుకు విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా మొదటి జట్టు అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. భారత్ రెగ్యులర్ జట్టు ఇంగ్లండ్ వెళ్లిన కారణంగా.. యువకులతో కూడిన రెండవ జట్టు లంక పర్యటనకు వెళ్లింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇరుజట్లు జులై 18 నుంచి తలపడనున్నాయి. భారత జట్టు జులై 28, 2012 నుంచి శ్రీలంకలో ఒక్క వన్డేలోనూ ఓడిపోలేదు. శ్రీలంకలో వరుసగా 8 వన్డేల విజయ పరంపరను కొనసాగిస్తోంది టీమిండియా జట్టు. శ్రీలంకలో ఇప్పటి వరకు వరుసగా ఇన్ని వన్డేల్లో ఇతర విజిటింగ్ జట్టు గెలవలేదు.

2017 లో టీమిండియా శ్రీలంక జట్టును 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. యువకులతో కూడిన జట్టుకు ధావన్ నాయకత్వం వహించనున్నాడు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ వంటి ప్లేయర్లు శ్రీలంక టూర్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు టీమిండియా జట్టు శ్రీలంకలో 61 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 28 మ్యాచుల్లో గెలవగా, 27 మ్యాచుల్లో ఓడిపోయాడు. అలాగే 6 మ్యాచుల్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇప్పటి వరకు శ్రీలంకలో ఎక్కువ మ్యాచులు గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది. ఇతర జట్లేవీ ఇన్ని మ్యాచుల్లో గెలవలేదు. తరువాతి స్థానంలో పాకిస్తాన్ జట్టు నిలిచింది. శ్రీలంకలో పాక్ జట్టు మొత్తం 41 మ్యాచులు ఆడింది. ఇందులో కేవలం 18 మ్యాచులు మాత్రమే గెలిచి, 20 మ్యాచుల్లో ఓడిపోయింది. మరో మూడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు.

శ్రీలంకలో భారత్‌కు 45.90 సక్సెస్ రేటు ఉంది. అక్కడ కనీసం 10 మ్యాచ్‌లు ఆడిన జట్లలో టీమిండియాకు అత్యుత్తమైన రికార్డుగా ఉంది. ప్రస్తుత శ్రీలంక జట్టు పరిస్థితి చూస్తే.. టీమిండియా అవలీలగా వన్డే సిరీస్‌తో పాటు టీ20 సిరీస్‌ను గెలుచుకుంటుదనడంలో సందేహం లేదు. ఆ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో వన్డే సిరీస్‌తోపాటు, టీ20 సిరీస్‌ను కోల్పోయి విమర్శలు పాలైంది. అలాగే కోవిడ్ రూల్స్ పాటించలేదంటూ ముగ్గురు ఆటగాళ్లను టీం నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో జట్టు చాలా బలహీనంగా తయారైంది. యువకులతో కూడిన భారత్ జట్టు అన్ని రంగాల్లో అద్భుతంగా కనిపిస్తోంది.

Also Read:

Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్ క్రీడల్లో కనిపించిన 9 మంది స్టార్ ఆటగాళ్లు వీరే..!

IND Vs SL: కోహ్లీ ప్లేస్‌కు భారీ పోటీ.. రేసులో ముగ్గురు ఆటగాళ్లు.. వారికి మొండిచేయి.!

MS Dhoni: ధోని సహచరుడు దంచేశాడు..10 బంతుల్లో 52 పరుగులు.. 6 సిక్సులు.. 4 ఫోర్లు