IND vs AUS: చివరి ఓవర్లో తడబడిన భారత్.. 9 పరుగుల తేడాతో ఓటమి.. సెమీస్ ఆశలు గల్లంతు?

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న టీమిండియా ఆశలు దాదాపుగా ముగిశాయి. భారత జట్టు 4 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. ఇప్పుడు న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ భారీ తేడాతో ఓడిస్తే.. అప్పుడు మాత్రమే టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆడగలదు.

IND vs AUS: చివరి ఓవర్లో తడబడిన భారత్.. 9 పరుగుల తేడాతో ఓటమి.. సెమీస్ ఆశలు గల్లంతు?
India Women Vs Australia Women (2)
Follow us
Venkata Chari

|

Updated on: Oct 13, 2024 | 11:14 PM

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న టీమిండియా ఆశలు దాదాపుగా ముగిశాయి. భారత జట్టు 4 మ్యాచ్‌ల్లో కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. ఇప్పుడు న్యూజిలాండ్‌ను పాకిస్థాన్ భారీ తేడాతో ఓడిస్తే.. అప్పుడు మాత్రమే టీమ్ ఇండియా సెమీఫైనల్ ఆడగలదు.

షార్జా వేదికగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇందులో తహ్లియా మెక్‌గ్రాత్ 40 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 47 బంతుల్లో 54 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్ చెరో 2 వికెట్లు తీశారు.

రెండు జట్ల ప్లేయింగ్-11

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, రేణుకా సింగ్.

ఆస్ట్రేలియా: తహ్లియా మెక్‌గ్రాత్ (కెప్టెన్), బెత్ మూనీ, గ్రేస్ హారిస్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డనర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, సోఫీ మోలినెక్స్, మేగాన్ షుట్, డార్సీ బ్రౌన్.