T20 World Cup: కోహ్లీ, బాబర్ కాదండోయ్.. టీ20 ప్రపంచకప్ 2024లో రన్ మెషీన్ అతనే: షాకిచ్చిన మాజీ ప్లేయర్
Ricky Ponting Travis Head T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభం కావడానికి మరో 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. టోర్నీ ప్రారంభానికి ముందు, అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు పడగొట్టే ఆటగాళ్ల పేర్లను అంచనా వేయడం ప్రారంభించారు. ఇందులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరు కూడా చేరింది. పాంటింగ్ ప్రకారం, ఈసారి ట్రావిస్ హెడ్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడని అంచనా వేశాడు.

ట్రావిస్ హెడ్ టోర్నీలో సంచలనం సృష్టిస్తాడు: పాంటింగ్
ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ ఇటీవల ఐపీఎల్ 2024 సందర్భంగా యాక్షన్‌లో కనిపించడం గమనార్హం. అందులో అతని అద్భుతమైన ఫామ్ కనిపించింది. తన ఆటతీరుతో తన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు.
ఐసీసీ రివ్యూ ప్రోగ్రామ్‌లో పాంటింగ్ మాట్లాడుతూ, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అతనే అవుతాడు. గత రెండేళ్లుగా వైట్, రెడ్ బాల్ క్రికెట్‌లో హెడ్ అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని నేను భావిస్తున్నాను. అతను చాలా పెద్ద సందర్భాలలో ముఖ్యమైన పరుగులు చేశాడని తెలిపారు.
IPL 17వ సీజన్‌లో, హెడ్ 15 మ్యాచ్‌లలో 40.50 సగటు, 191.55 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన పరంగా హెడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు టోర్నమెంట్‌లో కూడా అతని అద్భుతమైన ఫామ్ కొనసాగుతుందని ఆస్ట్రేలియా అభిమానులు ఆశిస్తున్నారు.
ఈసారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పాల్గొంటుండగా గ్రూప్ దశలో అన్ని జట్లను 4 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి. ఈసారి మిచెల్ మార్ష్ ఈ ఈవెంట్‌లో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నాడు. ఒమన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, నమీబియాలతో కూడిన గ్రూప్ Bలో ఆస్ట్రేలియా స్థానం పొందింది. కంగారూ జట్టు జూన్ 6న ఒమన్‌తో ఆడడం ద్వారా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..