AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: అరంగేట్రంలో భారత దిగ్గజాలకు చుక్కలు.. సరికొత్త చరిత్రతో స్పెషల్ క్లబ్‌లో యువ బౌలర్..

ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ తన మొదటి టెస్టు మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి, భారత దిగ్గజ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. భారత్‌పై అరంగేట్రంలోనే 'పాంచ్ పటాకా' సాధించాడు.

IND vs AUS: అరంగేట్రంలో భారత దిగ్గజాలకు చుక్కలు.. సరికొత్త చరిత్రతో స్పెషల్ క్లబ్‌లో యువ బౌలర్..
Todd Murphy
Venkata Chari
|

Updated on: Feb 10, 2023 | 8:51 PM

Share

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. మర్ఫీకి కేవలం 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తర్వాత టెస్టులో అవకాశం వచ్చింది. అతను తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 13 ఇన్నింగ్స్‌లలో 25.20 సగటు, 2.62 ఎకానమీ రేటుతో 29 వికెట్లు పడగొట్టాడు.

అరంగేట్రం టెస్టులోనే చరిత్ర సృష్టించిన టాడ్ మర్ఫీ..

తొలి టెస్టులో మర్ఫీ ‘ఐదు వికెట్లు’ పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అరంగేట్రంలోనే 5 వికెట్లు తీసిన నాలుగో ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్‌గా నిలిచాడు. అతను పీటర్ టేలర్, జాసన్ క్రెజ్జా, నాథన్ లియోన్‌ల ఎలైట్ క్లబ్‌లో చేరాడు.1986/87లో సిడ్నీలో ఇంగ్లండ్‌పై టేలర్ (6/78) ఈ ఘనత సాధించాడు. క్రెజా (8/215) 2008/09లో నాగ్‌పూర్ స్టేడియంలో భారత్‌పై అలా చేశాడు. కాగా, లియాన్ (5/34) 2011లో గాలే వేదికగా శ్రీలంకపై ఈ ఘనత సాధించాడు.

భారత దిగ్గజాలను బలిపశువులుగా..

మర్ఫీ టెస్ట్ కెరీర్‌లో తొలి బాధితుడు ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 71 బంతుల్లో 20 పరుగులు చేసిన తర్వాత బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని తన వలలో పడేసుకున్నాడు. అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 62 బంతుల్లో 23 పరుగులు జోడించాడు. మర్ఫీకి మూడో వికెట్‌గా ఛటేశ్వర్‌ (7), నాలుగో వికెట్‌ విరాట్‌ కోహ్లి (12) చిక్కారు. అరంగేట్రం టెస్టులోనే టాప్-4 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కూడా నిలిచాడు. ఐదో వికెట్గా శ్రీకర్ భరత్ (8)ని పెవిలియన్ చేర్చాడు.

ఇవి కూడా చదవండి

భారత్‌తో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఈ ఆస్ట్రేలియా యువ ఆటగాడు 5 వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా తరపున ఇలాంటి ఫీట్‌ చేసిన నాలుగో ఆఫ్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ నలుగురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పీటర్ టేలర్..

ఈ జాబితాలో మొదటి పేరు పీటర్ టేలర్. అతను 1986/87లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 78 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.

జాసన్ క్రెజా..

ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో ఆఫ్ స్పిన్నర్ పేరు జాసన్ క్రేజా. ఈ ఆటగాడు 2008/09 సమయంలో నాగ్‌పూర్‌లో భారతదేశంపై అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే క్రెజా 215 పరుగులకు 8 వికెట్లు పడగొట్టాడు.

నాథన్ లియోన్..

ఈ జాబితాలో మూడో ఆస్ట్రేలియన్ ఆఫ్ స్పిన్నర్ పేరు లెథన్ లియాన్. నాథన్ లియాన్ 2011లో గాలే వేదికగా శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే 34 పరుగులు మాత్రమే చేసి ఐదుగురు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు పంపాడు.

టాడ్ మర్ఫీ..

నాథన్ తర్వాత ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ, ప్రస్తుతం జరుగుతున్న నాగ్‌పూర్ టెస్టులో నాథన్ లియాన్‌తో ఆడుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో నాగ్‌పూర్ టెస్టులో భారత్‌పై మర్ఫీ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి ఈ జాబితాలో చేరాడు. మర్ఫీ 66 పరుగులు ఇచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..