అప్పుడు తోపు ప్లేయర్.. ఇప్పుడు గతిలేక బ్యాంక్‌లో ఉద్యోగం.. టీమిండియాకే సుస్సు పోయించిన ఈ ప్లేయర్ ఎవరంటే..?
Australia Pace Bowler: క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ బౌలర్. కానీ, అక్కడ విజయం సాధించలేకపోయాడు. అయితే, నిరాశ చెందకుండా, తన విద్యాభ్యాసంపై దృష్టి సారించి, కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత, ఒక ప్రముఖ బ్యాంకులో అకౌంటెంట్‌గా ఉద్యోగం పొందాడు.

క్రికెట్ చరిత్రలో ఎందరో ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ నాథన్ బ్రాకెన్ ఒకరు. తన లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్‌తో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బ్రాకెన్, ఒకప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ వన్డే బౌలర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే, అతని జీవిత ప్రయాణం క్రికెట్ మైదానానికే పరిమితం కాలేదు. ఒక స్టార్ క్రికెటర్ నుంచి సాధారణ బ్యాంకు అకౌంటెంట్‌గా మారిన అతని స్టోరీ ఎందరికో స్ఫూర్తినిస్తుంది.
క్రికెట్‌లో కెరీర్..
2001లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన నాథన్ బ్రాకెన్, తన స్వింగ్ బౌలింగ్‌తో తక్కువ కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. 2003, 2007 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో అతను కీలక సభ్యుడు. అతని కెరీర్లో ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా 2008లో ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను కూడా అతను ఇబ్బంది పెట్టాడు. 2001లో ‘యంగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’, 2009లో ‘ఆస్ట్రేలియా వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకున్నాడు.
గాయం కారణంగా రిటైర్‌మెంట్..
దురదృష్టవశాత్తు, 2011లో తీవ్రమైన మోకాలి గాయం కారణంగా అతని క్రికెట్ కెరీర్ అకస్మాత్తుగా ముగిసింది. ఈ గాయం కారణంగా అతను క్రికెట్‌కు అకాలంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. రిటైర్‌మెంట్ తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఈ సమయంలోనే అతను తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. క్రికెట్ ప్రపంచం నుంచి బయటపడి, సాధారణ జీవితాన్ని గడపాలని ఆశించాడు.
బ్యాంక్ అకౌంటెంట్‌గా కొత్త జీవితం..
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, నాథన్ బ్రాకెన్ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ, అక్కడ విజయం సాధించలేకపోయాడు. అయితే, నిరాశ చెందకుండా, తన విద్యాభ్యాసంపై దృష్టి సారించి, కమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత, ఒక ప్రముఖ బ్యాంకులో అకౌంటెంట్‌గా ఉద్యోగం పొందాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రశ్రేణి బౌలర్‌గా పేరు పొందిన వ్యక్తి, ఇప్పుడు ఒక సాధారణ ఉద్యోగిగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అతని జీవిత ప్రయాణం చాలా మందికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. జీవితంలో ఏ పరిస్థితులు వచ్చినా, ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చని అతను నిరూపించాడు. క్రికెటర్ నుంచి బ్యాంక్ అకౌంటెంట్‌గా మారిన నాథన్ బ్రాకెన్ కథ, మార్పును ధైర్యంగా స్వీకరించడం, కఠిన పరిస్థితులలో కూడా నిలదొక్కుకోవడం ఎలాగో మనకు తెలియజేస్తుంది.
నాథన్ బ్రాకెన్ కెరీర్..
5 టెస్టులు ఆడిన ఈ బౌలర్ 12 వికెట్లు తీశాడు. అలాగే, 116 వన్డేలు ఆడిన నాథన్ బ్రాకెన్ 174 వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 కెరీర్ పరిశీలిస్తే, 19 మ్యాచ్‌లు ఆడిన నాథన్ 19 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








