AUS vs IND: 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం.. అరుదైన జాబితాలో రాహుల్, జైస్వాల్ జోడీ

India vs Australia, Border-Gavaskar Trophy: టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ 229 బంతుల్లోనే తొలి వికెట్‌కు 100 పరుగుల మార్కును దాటారు. దీంతో వీరిద్దరు ఆరో భారత జోడీగా రికార్డ్ సృష్టించారు.

AUS vs IND: 20 ఏళ్ల తర్వాత తొలి సెంచరీ భాగస్వామ్యం.. అరుదైన జాబితాలో రాహుల్, జైస్వాల్ జోడీ
Kl Rahu, Yashasvi Jaiswal
Follow us
Venkata Chari

|

Updated on: Nov 23, 2024 | 2:02 PM

India vs Australia, Border-Gavaskar Trophy: శనివారం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరుగుతోన్న మొదటి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు రెండో రోజులో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆకట్టుకున్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌తోనూ తగ్గేదేలే అంటూ దూసుకపోతున్నారు. ఈ సందర్భంగా 2004 తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ తొలి 100 పరుగుల టెస్ట్ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ 229 బంతుల్లోనే ఈ ఘనత సాధించారు. డౌన్‌అండర్‌లో తొలి వికెట్‌కు 100 పరుగుల మార్కును దాటిన ఆరో భారత జోడీగా వీరు రికార్డు సృష్టించారు.

ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ తన అర్ధ సెంచరీని సాధించాడు. ఇందులో 5 ఫోర్లు కొట్టాడు. ఆరంభం నుంచి క్రీజులో ఎంతో సౌకర్యవంతంగా కనిపించిన రాహుల్ 3 ఫోర్లు బాది 40 పరుగులు జోడించాడు.

ఇవి కూడా చదవండి

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ ఎనిమిది బంతుల్లో డకౌట్‌గా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అలాగే, రాహుల్ వివాదాస్పద DRSతో తన వికెట్‌ను కోల్పోయాడు. 26 పరుగులు చేసి వెనుదిరగాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఈ ఇద్దరు రెండోవ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్లకు ఏమాత్రం భయపడుకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.

ఆస్ట్రేలియాలో 100 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం పూర్తి చేసిన భారత ఆటగాళ్లు..

సునీల్ గవాస్కర్/కె శ్రీకాంత్ – 191 సిడ్నీలో, 1986

సునీల్ గవాస్కర్/చేతన్ చౌహాన్ – 165 మెల్బోర్న్, 1981

ఆకాష్ చోప్రా/వీరేంద్ర సెహ్వాగ్ – 141 మెల్బోర్న్, 2003

వినూ మన్కడ్/చందు సర్వతే – 124 మెల్‌బోర్న్‌లో, 1948

ఆకాష్ చోప్రా/వీరేంద్ర సెహ్వాగ్ – 123 సిడ్నీలో, 2004

యశస్వి జైస్వాల్/కేఎల్ రాహుల్ – 100* పెర్త్‌లో, 2024.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..