IPL 2025: మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు.. లిస్ట్‌లో టీమిండియా ప్లేయర్ సొదరుడు
IPL 2025 Mega Auction: మెగా వేలానికి రంగం సిద్ధమైంది. రేపు, ఎల్లుండి దుబాయ్ వేదికగా ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. ఇందులో స్టార్ ప్లేయర్లు కూడా ఉన్నారు. దీంతో ఈసారి వేలంపై అందరి ఆసక్తి నెలకొంది. రికార్డులు ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలని అంతా ఎదురుచూస్తున్నారు.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జరుగుతుంది. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఈసారి వేలం జరగనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలం సమయంలో, చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఎలాంటి ధర పొందుతారో చూడాల్సి ఉంది. అలాగే, ప్రతి జట్టు కొంతమంది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లపై కన్నేసింది. ఈ అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు ఐపీఎల్ వేలం సమయంలో భారీ మొత్తంలో డబ్బును పొందవచ్చు అని భావిస్తున్నారు. ఈ లిస్టులో ఎవరున్నారో ఓసారి చూద్దాం..
3. నెహాల్ వధేరా..
యువ బ్యాట్స్‌మెన్ నెహాల్ వధేరా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌లో భాగమయ్యాడు. అతను రెండు సీజన్లలో ముంబై జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2023లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అతన్ని విడుదల చేసింది. ఇటువంటి పరిస్థితిలో, మెగా వేలం సమయంలో నేహాల్ వధేరా కోసం ఖరీదైన బిడ్ పొందవచ్చని తెలుస్తోంది. అతను తన IPL కెరీర్‌లో 20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 350 పరుగులు చేశాడు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో అతని స్ట్రైక్ రేట్ 140గా ఉంది. టీ20లో ఇలాంటి స్ట్రైక్ రేట్‌లు ఉన్న బ్యాట్స్‌మెన్ అవసరం.
2. ముషీర్ ఖాన్..
ముషీర్ ఖాన్ గురించి చెప్పాలంటే, అతను సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు. సర్ఫరాజ్ ప్రస్తుతం భారత జట్టు తరుపున టెస్టు క్రికెట్‌లో దూసుకుపోతున్నాడు. ముషీర్‌కి ఇంకా ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. కానీ, అతను ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దులీప్ ట్రోఫీలో 181 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తర్వాత అతను వెలుగులోకి వచ్చాడు. అప్పటి నుంచి అతను ఐపీఎల్‌లో భారీ మొత్తాన్ని అందుకోగలడనే చర్చ ఉంది.
1. అశుతోష్ శర్మ..
గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున అశుతోష్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 11 మ్యాచ్‌లలో 189 పరుగులు చేశాడు. అయితే, అతని స్ట్రైక్ రేట్ 167గా ఉంది. ఈ 11 మ్యాచ్‌ల్లో అతను 15 సిక్సర్లు కొట్టాడు. అతను కొన్ని మ్యాచ్‌లలో పంజాబ్ కింగ్స్‌ను ఒంటరిగా నడిపించాడు. ఈ కారణంగా, అతను విడుదలైనప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు. గత సీజన్‌లో అతని ఆటతీరు చూస్తుంటే ఈసారి వేలంలో భారీ మొత్తం దక్కించుకోవడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..