AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL, PAK vs BAN.. సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?

ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ సెమీఫైనల్ లైనప్ ఖరారైంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ చివరి నాలుగు జట్లుగా నిలిచాయి. క్వార్టర్ ఫైనల్స్ అన్నీ వర్షం కారణంగా రద్దవడంతో ర్యాంకింగ్స్ ఆధారంగా సెమీస్ బెర్తులు దక్కాయి. ఇప్పుడు సెమీస్‌ కూడా వర్షం బారిన పడితే ఫైనల్ చేరే జట్లపై ఆసక్తి పెరిగింది.

IND vs SL, PAK vs BAN.. సెమీస్‌కు రంగం సిద్ధం.. వర్షం వస్తే ఫైనల్ చేరే టీంలు ఇవే..?
Asian Games 2026 Semi Finals
Venkata Chari
|

Updated on: Sep 29, 2026 | 12:24 PM

Share

జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్‌లో (Asian Games 2026) సెమీఫైనల్ సమీకరణం ఖరారైంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ చివరి నాలుగు జట్లుగా నిలిచాయి. క్వార్టర్ ఫైనల్ దశలో వర్షం కీలక పాత్ర పోషించింది. నాలుగు మ్యాచ్‌లు వర్షం, తడి మైదానం కారణంగా రద్దయ్యాయి. దీంతో ప్రత్యర్థి కంటే మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ ఉన్న జట్లకు సెమీఫైనల్ బెర్తులు లభించాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు (Team India), పాకిస్థాన్ క్రికెట్ జట్టు (Pakistan), శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lanka), బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు (Bangladesh) చివరి నాలుగు జట్లుగా పోటీలో నిలిచాయి. ఇప్పుడు సెమీఫైనల్స్‌ కూడా వర్షం ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఉండటంతో ఫైనల్ సమీకరణంపై ఆసక్తి నెలకొంది.

సెమీఫైనల్‌లో తొలి మ్యాచ్ పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 1న భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరో సెమీఫైనల్‌లో భారత్, శ్రీలంక తలపడతాయి. ఈ మ్యాచ్ అదే రోజు ఉదయం 10:30 గంటలకు మొదలవుతుంది.

ఎక్కువమంది చదివినది: నా టార్గెట్ ఫిక్స్.. అందుకోసం అడ్డొచ్చినోళ్లను తొక్కి పడేసుడే.. విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇవి కూడా చదవండి

ఐచి-నగోయా ప్రాంతంలో వర్షం కొనసాగే అవకాశం ఉండటంతో సెమీఫైనల్ మ్యాచ్‌ల పరిస్థితిపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు ఎదురైన పరిస్థితి సెమీస్‌లోనూ వస్తే, మ్యాచ్ రద్దైన సందర్భంలో మెరుగైన ర్యాంకింగ్ ఉన్న జట్టుకే ఫైనల్ బెర్త్ దక్కుతుంది.

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్‌కు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆరో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉంది. అందువల్ల ర్యాంకింగ్ ఆధారంగా పాకిస్థాన్‌కు ప్రయోజనం కలుగుతుంది.

ఎక్కువమంది చదివినది: టాస్ కూడా పడకుండానే ముగిసిన మ్యాచ్.. నేరుగా సెమీస్‌లోకి భారత్

భారత్, శ్రీలంక సెమీఫైనల్ కూడా రద్దయితే భారత జట్టుకే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక తొమ్మిదో స్థానంలో ఉంది.

అందుకే రెండు సెమీఫైనల్స్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే, ర్యాంకింగ్ సమీకరణాల ప్రకారం భారత్, పాకిస్థాన్ ఫైనల్‌లో తలపడే పరిస్థితి ఏర్పడుతుంది. సెమీస్ పూర్తిగా జరిగితే మాత్రం అక్టోబర్ 1న జరిగే రెండు మ్యాచ్‌ల ఫలితాలే తుది ఫైనలిస్టులను నిర్ణయిస్తాయి.

Follow Us