అప్పుడు టీమిండియాను ఓడించాడు.. ఇప్పుడు 47 బంతుల్లో విధ్వంసం సృష్టించాడు.. ఛాంపియన్‌గా నిలిచాడు..
ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. భారత పర్యటనలో ఉండగా.. అవుట్ ఆఫ్ సిలబస్‌గా వచ్చిన ఓడించాడు ఓ క్రికెటర్..

ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టు.. భారత పర్యటనలో ఉండగా.. అవుట్ ఆఫ్ సిలబస్‌గా వచ్చిన ఓడించాడు ఓ క్రికెటర్.. ఇక ఇప్పుడు ఆ ఆటగాడే తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అతడెవరో కాదు ఆస్టన్ టర్నర్. ప్రస్తుతం జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ ప్లే-ఆఫ్స్‌లో ఈ పెర్త్ స్కోర్చర్స్ కెప్టెన్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో టర్నర్(84) విధ్వంసకర ఇన్నింగ్స్‌కు.. పెర్త్ జట్టు సరాసరి ఫైనల్స్‌కు చేరింది.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్ హెన్రిక్స్(58) అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. జోర్డాన్ సిల్క్ 34 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక 152 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన పెర్త్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఎస్కినాజి(4), హార్డీ(9), జోష్ ఇంగ్లీస్(0) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. అయితే మరో ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్(53), కెప్టెన్ ఆస్టన్ టర్నర్(84)తో కలిసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. 9 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకున్నారు. టర్నర్ 47 బంతులు ఎదుర్కుని 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 84 పరుగులు చేశాడు. లీగ్ మ్యాచ్‌ల నుంచి జట్టుకు సంబంధించి ప్రతీ విజయంలోనూ టర్నర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటిదాకా 15 మ్యాచ్‌లు ఆడిన టర్నర్ 3 అర్ధ సెంచరీలతో 328 పరుగులు చేశాడు.




