David Warner: డబ్బుకు తగ్గట్టే ఆట.. ఇదేందిది వార్నర్ మావ ఇంత మాట అనేశాడు..
David Warner Key Comments: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. తన బ్యాటింగ్‌తో కాకుండా పదునైన మాటలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఓ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న డేవిడ్ వార్నర్‌కు ఓ వింత ప్రశ్న ఎదురైంది.

David Warner: పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో అత్యధిక పారితోషికం పొందిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. తన బ్యాటింగ్‌తో కాకుండా పదునైన మాటలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఓ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న డేవిడ్ వార్నర్‌కు ఓ వింత ప్రశ్న ఎదురైంది. పీఎస్‌ఎల్‌లో తన ఐపీఎల్ ఫామ్‌ను ఎందుకు పునరావృతం చేయడం లేదంటూ విలేకర్లు ప్రశ్నలు సంధించారు. దీనికి వార్నర్ నవ్వుతూ “ఎంత డబ్బు ఇస్తారో, అంతే ప్రదర్శన ఇస్తాం” అంటూ ఫన్నీగా ఆన్సర్ చేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఫక్కున నవ్వేశారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వార్నర్ వ్యాఖ్యలు..
ఈ సీజన్‌లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న వార్నర్.. పీఎస్‌ఎల్ 2025 సీజన్ కోసం రూ. 8 కోట్లు (~USD 960,000 ) కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇది లీగ్‌లోని చాలా మంది ఆటగాళ్ల కంటే చాలా ఎక్కువ. భారీ జీతం ఉన్నప్పటికీ, వార్నర్ టీం కరాచీ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచింది.
కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 4 పాయింట్లు, -0.014 నికర రన్ రేట్‌తో మూడవ స్థానంలో ఉంది. లాహోర్ ఖలందర్స్ కూడా 4 పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్‌తో వెనుకబడి ఉంది.
వార్నర్ ఆటతీరు బాగోలేదు. అయితే, అభిమానుల నుంచి విమర్శకుల వరకు ఇద్దరూ ఈ అనుభవజ్ఞుడైన ఓపెనర్ నుంచి సిగ్నేచర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
పీఎస్‌ఎల్ (PSL) 2025 సీజన్ వేడెక్కుతోన్న కొద్దీ, అందరి దృష్టి వార్నర్‌పైనే నెలకొంది.
పాయింట్ల పట్టిక..
ఇస్లామాబాద్ యునైటెడ్ – 6 పాయింట్లు (NRR +2.947)
లాహోర్ ఖలందర్స్ – 4 పాయింట్లు (NRR +2.051)
కరాచీ కింగ్స్ – 4 పాయింట్లు (NRR -0.014)
క్వెట్టా గ్లాడియేటర్స్ – 2 పాయింట్లు
ముల్తాన్ సుల్తానులు – 0 పాయింట్లు
పెషావర్ జల్మి – 0 పాయింట్లు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




