AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోహ్లీ బ్యాటింగ్ చూసి కునుకుతీసిన అనుష్క శర్మ.. వీడియో వైరల్

Anushka Sharma Sleeps While Watching Virat Kohli Batting: ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్స్‌కు చేరుకుంది. విరాట్ కోహ్లీ 84 పరుగుల ఇన్నింగ్స్‌తో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సమయంలో అనుష్క శర్మ కూడా స్టేడియంలో ఉంది. అయితే, ఆమె నిద్రపోతున్న వీడియో వైరల్ అవుతోంది.

Video: కోహ్లీ బ్యాటింగ్ చూసి కునుకుతీసిన అనుష్క శర్మ.. వీడియో వైరల్
Anushka Sleep Kohli Batting
Venkata Chari
|

Updated on: Mar 05, 2025 | 7:18 PM

Share

Anushka Sharma Sleeps While Watching Virat Kohli Batting: ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి సెమీఫైనల్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన సంగతి తెలిసిందే. మార్చి 4న జరిగిన ఈ మ్యాచ్‌లో టీం ఇండియా బలమైన విజయాన్ని నమోదు చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ 84 పరుగుల ఇన్నింగ్స్‌తో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. భారత జట్టు ఆడిన ఈ కీలక మ్యాచ్‌లో విరాట్‌కు మద్దతుగా అతని భార్య అనుష్క శర్మ కూడా స్టేడియంలో ఉంది. తాజాగా ఆమె నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ బ్యాటింగ్ చేస్తుండగానే ఆమె నిద్రపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

అనుష్క స్టేడియంలోనే నిద్రపోయిందా?

భారత్ బ్యాటింగ్ చేస్తున్న 15వ ఓవర్‌ తర్వాత బ్రేక్ ఇచ్చారు. దీంతో కెమెరామెన్ అనుష్క శర్మ వైపు ఫోకస్ చేశాడు. దీంతో ఆమె నిద్రపోతున్నట్లు చూపించాడు. ఈ సమయంలో, కోహ్లీ 28 బంతుల్లో 18 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ కోణం నుంచి చూస్తే, కోహ్లీ కొంచెం నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, విరాట్ స్లోగా బ్యాటింగ్ వల్లే నిద్రపోయిందని మనం ఖచ్చితంగా చెప్పలేం. అయితే, విరాట్ నెమ్మదిగా ఆడటం గురించి మాట్లాడుకుంటే, ఈ రకమైన బ్యాటింగ్ వెనుక ఒక పెద్ద కారణం ఉంది. నిజానికి, పవర్ ప్లేలో రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత, భారత జట్టు కొంత ఒత్తిడిలో చిక్కుకుంది. అప్పుడు మ్యాచ్‌లో పట్టు సాధించడానికి భారత్‌కు వికెట్లు ఆదా చేయడంతో పాటు భాగస్వామ్యం అవసరం. దీంతో కోహ్లీ స్ట్రైక్ రోటేట్ చేస్తూ సింగిల్స్ మీద ఫోకస్ చేశాడు.

అలాగే, అనుష్క మరో వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. అందులో ఆమె టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. కోహ్లీ డ్యాన్స్‌లు చేస్తూ భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూసిన అనుష్క ముఖం కూడా ఆనందంతో కనిపించింది.

హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా కోహ్లీ..

దుబాయ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించే క్రమంలో టీం ఇండియా 5వ ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. అందుకే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ముందుగానే బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. అతను వచ్చిన రెండు ఓవర్ల తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నిష్క్రమించాడు. ఆ తర్వాత, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించి 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ అయ్యర్ కూడా 134 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ అక్షర్ పటేల్‌తో కలిసి 44 పరుగులు, కేఎల్ రాహుల్‌తో కలిసి 47 పరుగులు జోడించి మ్యాచ్‌ను భారత్‌కు అనుగుణంగా మార్చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..