Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూపర్ సీన్ ఇదే భయ్యో.. అస్సలు మిస్ కావొద్దంతే..

Amanjot Kaur's Magical Catch Video: ఒక క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదని నిరూపించిన ఈ క్షణాన్ని అభిమానులు 'మిస్ట్రీ' గా అభివర్ణించారు. ఆ ఒత్తిడిలో, బంతిని వదిలేయకుండా అమన్‌జోత్ చూపిన ఆత్మవిశ్వాసం, అంకితభావం భారతదేశానికి మొట్టమొదటి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను తెచ్చిపెట్టింది.

Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూపర్ సీన్ ఇదే భయ్యో.. అస్సలు మిస్ కావొద్దంతే..
Amanjot Kaur Catch Video
Venkata Chari
|

Updated on: Nov 03, 2025 | 8:10 AM

Share

Amanjot Kaur’s Magical Catch Video: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో, భారత్ తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడానికి కేవలం ఒక క్షణం సరిపోయింది. యావత్ దేశం ఊపిరి బిగబట్టి చూస్తున్న ఆ ఉత్కంఠభరిత పోరులో, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (Laura Wolvaardt) వికెట్‌ను తీసిన అమన్‌జోత్ కౌర్ క్యాచ్, మ్యాచ్ గమనాన్ని ఒక్కసారిగా భారత్ వైపు తిప్పేసింది.

హీరోయిన్ ఆఫ్ ది మూమెంట్: వోల్వార్డ్ ఔట్..

భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించడానికి బరిలోకి దిగగా, ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్భుతమైన శతకం (101 పరుగులు) తో ఒకవైపు గోడలా నిలబడింది. ఆమె క్రీజులో ఉన్నంతవరకు, దక్షిణాఫ్రికా విజయానికి దగ్గరగానే ఉంది. మ్యాచ్ 42వ ఓవర్‌లో, భారత స్పిన్నర్ దీప్తి శర్మ వేసిన బంతిని వోల్వార్డ్ భారీ షాట్ బాదడానికి ప్రయత్నించింది.

అసలేం జరిగిందంటే..

బంతి గాల్లోకి లేచి డీప్ మిడ్-వికెట్ దిశగా దూసుకుపోయింది. అక్కడే ఉన్న ఫీల్డర్ అమన్‌జోత్ కౌర్ బంతిని అందుకోవడానికి వేగంగా పరిగెత్తింది. అయితే, తొలి ప్రయత్నంలో బంతి ఆమె చేతిలో పడినా, త్రుటిలో జారిపోయింది. ఆ తదుపరి క్షణాల్లో, అమన్‌జోత్ కౌర్ రెండోసారి, ఆపై మూడోసారి బంతిని ఒడుపుగా అందుకోవడానికి ప్రయత్నించి, చివరికి డైవ్ చేసి బంతిని సురక్షితంగా పట్టుకుంది.

క్యాచ్ అందుకున్న వెంటనే, అమన్‌జోత్ అక్కడే పడుకుని ఊపిరి పీల్చుకుంది. ఆ క్యాచ్ ఎంత కీలకమో తెలియజేస్తూ, మైదానంలో ఉన్న భారత క్రీడాకారిణులంతా ఆమె చుట్టూ చేరి ఉద్వేగంతో సంబరాలు చేసుకున్నారు.

ఫైనల్‌కు అసలు టర్నింగ్ పాయింట్..

లారా వోల్వార్డ్ వికెట్ పడటం దక్షిణాఫ్రికా జట్టు వెన్ను విరిచింది. ఛేజింగ్‌కు ప్రధానాధారం వోల్వార్డ్ మాత్రమే. ఆమె ఔట్ కావడంతో మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది.

వోల్వార్డ్ వికెట్ పడిన తరువాత, దక్షిణాఫ్రికా వికెట్లు వరుసగా కోల్పోయింది. దీప్తి శర్మ అద్భుతమైన స్పెల్‌తో మిగిలిన బ్యాటర్లను త్వరగా పెవిలియన్‌కు పంపి, భారత్‌కు 52 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందించింది.

ఒక క్యాచ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చగలదని నిరూపించిన ఈ క్షణాన్ని అభిమానులు ‘మిస్ట్రీ’ గా అభివర్ణించారు. ఆ ఒత్తిడిలో, బంతిని వదిలేయకుండా అమన్‌జోత్ చూపిన ఆత్మవిశ్వాసం, అంకితభావం భారతదేశానికి మొట్టమొదటి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను తెచ్చిపెట్టింది. ఈ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అమన్‌జోత్‌కు “క్వీన్ ఆఫ్ ది బౌండరీ” అనే బిరుదును తెచ్చిపెట్టింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..