Team India: 47 ఏళ్ల కల నెరవేరిన వేళ.. చారిత్రక విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
ICC Women's World Cup 2025: ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎన్నో ఆశలు, మరెన్నో గుండె బద్దలయ్యే ఓటముల తర్వాత, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు చివరకు కల నెరవేర్చుకుంది. క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వారసత్వాన్ని మోస్తూ, ఈ కొత్త తరం క్రీడాకారిణులు ప్రపంచ వేదికపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.

ICC Women’s World Cup 2025: భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక ప్రపంచ కప్ విజయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విజయాన్ని ‘అసాధారణ జట్టు స్ఫూర్తి, పట్టుదల’కు నిదర్శనంగా అభివర్ణించారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 52 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ఈ కప్పును గెలుచుకుంది.
చరిత్ర సృష్టించిన ‘మహిళా బ్లూ’..
ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎన్నో ఆశలు, మరెన్నో గుండె బద్దలయ్యే ఓటముల తర్వాత, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు చివరకు కల నెరవేర్చుకుంది. క్రికెట్ దిగ్గజాలు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి వారసత్వాన్ని మోస్తూ, ఈ కొత్త తరం క్రీడాకారిణులు ప్రపంచ వేదికపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. స్వదేశంలో జరిగిన ఈ ఫైనల్‌ను చూసేందుకు 45,000 మంది అభిమానులు స్టేడియాన్ని నింపేశారు. ఈ చారిత్రక ఘట్టం భారత మహిళా క్రికెట్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
ప్రధాన మంత్రి ప్రశంసలు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా జట్టును అభినందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఈ విజయానికి మరింత ప్రత్యేకతను ఇచ్చాయి.
A spectacular win by the Indian team in the ICC Women’s Cricket World Cup 2025 Finals. Their performance in the final was marked by great skill and confidence. The team showed exceptional teamwork and tenacity throughout the tournament. Congratulations to our players. This…
— Narendra Modi (@narendramodi) November 2, 2025
“ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్స్‌లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫైనల్‌లో వారి ప్రదర్శన గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నది. టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన జట్టు స్ఫూర్తిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులకు అభినందనలు. ఈ చారిత్రక విజయం భవిష్యత్తులో ఛాంపియన్లను క్రీడలు చేపట్టడానికి ప్రేరేపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది.
ప్రధాని మోదీ మాటల్లో పేర్కొన్న విధంగా, ఈ విజయం కేవలం క్రీడా ఘనత మాత్రమే కాదు, సామర్థ్యం, ఏకాగ్రత, నిలకడకు ప్రతిరూపంగా మారింది. మధ్యలో వరుసగా 3 ఓటములు ఎదురైనా, జట్టు వెనక్కి తగ్గకుండా, సెమీ-ఫైనల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి, ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసింది.
ఫైనల్‌లో కీలక ప్రదర్శనలు..
📸 📸
Champion Vibes all around! 🏆🥳
Scorecard ▶ https://t.co/TIbbeE4ViO#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvSA | #Champions pic.twitter.com/U7VOzp0vUT
— BCCI Women (@BCCIWomen) November 2, 2025
బ్యాటింగ్ బ్రిలియన్స్: షఫాలీ వర్మ (87 పరుగులు), దీప్తి శర్మ (58 పరుగులు) అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ 298 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
బాల్ అండ్ వికెట్స్: దీప్తి శర్మ 5 వికెట్లు (5/39) తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పగా, షఫాలీ వర్మ కూడా 2 కీలక వికెట్లు పడగొట్టి తన ఆల్‌రౌండర్ ప్రతిభను చూపింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగంతో కప్పును అందుకున్న దృశ్యం, భారత క్రీడా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మధుర జ్ఞాపకం. ఈ విజయం దేశంలోని కోట్లాది మంది బాలికలకు, యువతులకు పెద్ద కలలు కనడానికి, ధైర్యంగా క్రీడలను కొనసాగించడానికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.




