IPL 2025: మెగా వేలానికి ఏ టీం ఎన్ని ఖాళీలతో వెళ్తుందంటే.. ఎక్కువమంది ఆటగాళ్లు ఎవరికి కావాలంటే?

IPL 2025 Mega Auction: ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టు కనీసం 18 మంది ఆటగాళ్లను కలిగి ఉండాలి. గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. అంటే, మీరు ఇక్కడ 18 మంది కంటే తక్కువ ఆటగాళ్లను కలిగి ఉండకూడదు. ఐపీఎల్ మెగా వేలం ద్వారా ఒక్కో ఫ్రాంచైజీ 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

IPL 2025: మెగా వేలానికి ఏ టీం ఎన్ని ఖాళీలతో వెళ్తుందంటే.. ఎక్కువమంది ఆటగాళ్లు ఎవరికి కావాలంటే?
Ipl 2025 Mega Auction
Follow us
Venkata Chari

|

Updated on: Nov 10, 2024 | 9:07 PM

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 24, 25 తేదీల్లో మెగా యాక్షన్ జరగనుంది. ఈ వేలం ద్వారా ప్రతి జట్టు 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ఏర్పాటు చేయడం తప్పనిసరి. అంటే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో కనీసం 18 మంది ఆటగాళ్లు ఉండాలి. అలాగే గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. దీని ప్రకారం ప్రతి జట్టు ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉందో ఓసారి చూద్దాం..

ముంబై ఇండియన్స్: ఐపీఎల్ రిటైన్ ఆప్షన్ ద్వారా జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసింది. కాబట్టి మెగా వేలం ద్వారా మొత్తం 13 మంది ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేయడం తప్పనిసరి. ఇందులో 8 మంది విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్: CSK ఫ్రాంచైజీ రుతురాజ్ గైక్వాడ్, మతిషా పతిరానా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోనీలను జట్టులో ఉంచుకుంది. మొత్తం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏడుగురు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్, యస్సవి జైస్వాల్, ర్యాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మలను RR ఫ్రాంచైజీ రిటైన్ చేసింది. మరో 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. ఇందులో ఏడుగురు మంది విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్: మెగా వేలానికి ముందు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను ఉంచుకుంది. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఢిల్లీ జట్టు మరో 14 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గుజరాత్ టైటాన్స్: ఐపీఎల్ రిటైన్ ఆప్షన్ ద్వారా గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్‌లను అట్టిపెట్టుకుంది. గుజరాత్ టైటాన్స్ మరో 13 మంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందులో ఏడుగురు విదేశీ ఆటగాళ్ల స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్: రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, రమణదీప్ సింగ్‌లను కేకేఆర్ ఫ్రాంచైజీ తన వద్దే ఉంచుకుంది. మొత్తం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ మరో 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో ఆరుగురు మంది విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

లక్నో సూపర్‌జెయింట్స్: ఎల్‌ఎస్‌జీ ఫ్రాంచైజీ నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీలను ఉంచుకుంది. ఇప్పుడు మెగా వేలం ద్వారా 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పదమూడు మంది ఆటగాళ్లలో ఏడుగురు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

పంజాబ్ కింగ్స్: పంజాబ్ ఫ్రాంచైజీ ఈసారి శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లను మాత్రమే ఉంచుకుంది. ఇలా మొత్తం 16 మంది ఆటగాళ్లను మెగా వేలం ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో 8 మంది విదేశీ ఆటగాళ్లను కూడా కొనుగోలు చేయవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్: SRH ఫ్రాంచైజీ పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌లను కొనసాగించింది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మరో 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవచ్చు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: మెగా వేలానికి ముందు విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, యశ్ దయాల్‌లను RCB ఫ్రాంచైజీ జట్టులో ఉంచుకుంది. ఇప్పుడు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఏర్పాటు చేసేందుకు మెగా వేలం ద్వారా 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ పద్దెనిమిది మంది సభ్యుల నుంచి 8 మంది విదేశీ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం RCBకి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..