కేవలం 23 పరుగులకే ఆలౌట్..! అత్యధిక స్కోరు 7 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే దారుణమైన మ్యాచ్..
Cricket News: ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌లో 20 నుంచి 25 పరుగులు చేస్తే అతడు విఫలమయ్యాడు అంటారు. కానీ ఒక మ్యాచ్‌లో పదకొండు
Cricket News: ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌లో 20 నుంచి 25 పరుగులు చేస్తే అతడు విఫలమయ్యాడు అంటారు. కానీ ఒక మ్యాచ్‌లో పదకొండు మంది ఆటగాళ్లు కలిసి కేవలం 23 పరుగులు మాత్రమే చేస్తే ఏమంటారు.. అవును ఇది నిజం. అందులో కూడా మొత్తం పది వికెట్లు కేవలం 16 పరుగుల వ్యవధిలో కోల్పోయారు. అనుభవజ్ఞుడైన క్రికెటర్లతో ఉన్న ఆ జట్టు ఇంత తక్కువ స్కోరుకు ఆలౌట్ అవుతుందని బహుశా ఎవరూ ఊహించరు.. కానీ అది జరిగింది. ఆ మ్యాచ్ గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మ్యాచ్ 1965 లో మే 19, 20 తేదీల్లో యార్క్‌షైర్ వర్సెస్ హాంప్‌షైర్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 121 పరుగులు చేసింది. జట్టు 44.5 ఓవర్లలో కుప్పకూలింది. ట్రూమాన్ అత్యధికంగా 55 పరుగులు చేసి జట్టు పరువు కాపాడాడు. ఎందుకంటే ఒక సమయంలో జట్టు 47 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. 22 పరుగుల రెండవ అత్యధిక స్కోరును హట్టన్ చేశాడు. హాంప్‌షైర్ కోసం షాక్‌లెటన్ గరిష్టంగా ఆరు వికెట్లు తీయగా మిగిలిన నలుగురు బ్యాట్స్‌మెన్‌లను కాటమ్ పెవిలియన్ పంపించాడు.
హాంప్‌షైర్ మొదటి ఇన్నింగ్స్‌లో 125 పరుగులు చేసింది. మోస్ట్ ఓపెనర్ ఆర్‌ఈ మార్షల్ 51 పరుగులు చేశాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్. ఈ ఇన్నింగ్స్ ఎప్పుడు ప్రారంభమైందో ఎప్పుడు ముగిసిందో ఎవ్వరికి తెలియదు. కేవలం 20.4 ఓవర్లలో మొత్తం జట్టు 23 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో జియోఫ్, హట్టన్, ట్రూమాన్, ఇల్లింగ్‌వర్త్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. జట్టులోని ఐదుగురు ఆటగాళ్ళు ఖాతానే తెరవలేదు. చివరి వరకు నాటౌట్ గా ఉన్న విల్సన్ అత్యధికంగా 7 పరుగులు చేశాడు. ఇద్దరు ఆటగాళ్ళు ఒక్కొక్కరు ఒక పరుగు సాధించగా, ఒక బ్యాట్స్‌మెన్ మూడు పరుగులు చేశాడు. ఇందులో జట్టు తొలి వికెట్ 7 పరుగులకు పడింది. అంటే యార్క్‌షైర్ కేవలం10 వికెట్లు కేవలం 16 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. హాంప్‌షైర్ తరఫున వైట్ 6 వికెట్లు పడగొట్టాడు. హాంప్‌షైర్ 20 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా సాధించారు.