గాయం తగిలినా..నెత్తురు కారినా..పోరాటం ఆగదు

ఏ పనినైనా ప్రేమిస్తూ చెయ్యాలి. దానినే జీవితంగా భావిస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంతదూరమైనా వెళ్లాలి. అదే చేసి చూపిచ్చాడు ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్.  ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దీంతో అతనికి తీవ్ర గాయమై.. రక్తం కూడా కారింది. వెంటనే […]

గాయం తగిలినా..నెత్తురు కారినా..పోరాటం ఆగదు
Follow us
Ram Naramaneni

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 8:46 PM

ఏ పనినైనా ప్రేమిస్తూ చెయ్యాలి. దానినే జీవితంగా భావిస్తే ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంతదూరమైనా వెళ్లాలి. అదే చేసి చూపిచ్చాడు ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్.  ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దీంతో అతనికి తీవ్ర గాయమై.. రక్తం కూడా కారింది. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా మెడికల్ సిబ్బంది మైదానంలోకి వచ్చి.. అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే రిటైర్డ్ హర్ట్‌గా క్యారీ మైదానం నుంచి తప్పుకోకుండా..కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌ చేయడం అతనికి ఆటపై ఎంత నిబద్దత ఉందో చాటిచెబుతోంది. పలువురు నెటిజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.