CWG 2022: రజత పతక విజేతపై కనక వర్షం.. సంకేత్ సర్గర్‌కు రివార్డ్ ప్రకటించిన మహారాష్ట్ర సీఎం..
CWG 2022: బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 55 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్‌లో వెయిట్‌లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ రజత పతకాన్ని గెలుచిన సంగతి తెలిసిందే.
CWG 2022: బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో రజత పతకాన్ని సాధించిన వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గర్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆదివారం రూ.30 లక్షల బహుమతిని ప్రకటించారు. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన ప్రకారం, సర్గర్‌కు రూ. 30 లక్షలు, అతని శిక్షకుడికి రూ. 7 లక్షలు రివార్డ్‌గా ప్రకటించారు. శనివారం బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో సంకేత్ సర్గర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. స్వర్ణ పతకం సాధించే దిశగా సాగిన సంకేత్‌కు… భుజానికి అకాల గాయం కావడంతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022 పురుషుల 55 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో సంకేత్ క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కిలోలు, స్నాచ్‌లో 135 కిలోలు మొత్తం 248 కిలోలు ఎత్తాడు. ఈ సమయంలో, అతను కేవలం ఒక కిలోగ్రాము బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఈ ఈవెంట్‌లో, సీడబ్ల్యూజీ 2022లో పురుషుల 55 కిలోల ఈవెంట్‌లో మలేషియాకు చెందిన బిన్ కస్దాన్ మొహమ్మద్ అనీక్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
రజత పతకం సాధించిన అనంతరం సంకేత్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన భారత స్వాతంత్ర్య సమరయోధులకు నా పతకాన్ని అంకితం ఇస్తున్నాను. దీంతో పాటు పతకం గెలవడం గొప్పగా అనిపిస్తోందని, అయితే గోల్డ్ మెడల్ గెలవనందుకు కాస్త కోపం కూడా ఉందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో, చేతి గాయం నుంచి కోలుకోవడమే నా లక్ష్యం, ఆ తర్వాత నా తదుపరి లక్ష్యం చేరుకుంటానని సంకేత్ తెలిపాడు.
తండ్రి పాన్ షాపు నడపేవాడు..
రజత పతకం సాధించిన అనంతరం సంకేత్ మాట్లాడుతూ.. ‘చాలా మంది అథ్లెట్లు ఉన్నారని, పతకం సాధించిన తర్వాత వారి జీవితమే మారిపోయింది. ప్రభుత్వం ఇప్పటి వరకు చాలా సాయం చేసింది. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులకు సహాయం చేయాలనుకుంటున్నాను. మా నాన్న పాన్ షాప్ నడపడం నాకు ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చాడు. అందుకోసం వారికి నేను తగిన విధంగా సాయం చేయాలని కోరుకుంటున్నాను అని ప్రకటించాడు.