IND vs PAK CWG 2022: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న స్మృతి మంధాన ..
IND vs PAK: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘోరంగా ఓడిపోయింది. కానీ, రెండు రోజుల్లోనే టీమ్ ఇండియా అద్భుతంగా పునరాగమనం చేసి పాకిస్తాన్‌ను ఓడించింది.
ఆదివారం జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరపున స్నేహ రాణా, రాధా యాదవ్ అత్యధికంగా తలో 2 వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో PAK జట్టులోని 3 బ్యాట్స్‌మెన్‌లు రనౌట్ అయ్యారు. అనంతరం భారత జట్టు 11.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన కేవలం 42 బంతుల్లోనే 63 పరుగులు చేసింది. ఆమె బ్యాట్ నుంచి 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. జెమీమా రోడ్రిగ్స్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.
షెఫాలీ వర్మ తొమ్మిది బంతుల్లో 16 పరుగులు చేయగా, ఎస్ మేఘన 16 బంతుల్లో 14 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరపున తుబా హసన్, ఒమైమా సోహైల్ చెరో వికెట్ తీశారు. భారత్ తదుపరి మ్యాచ్ ఆగస్టు 3న బార్బడోస్‌తో తలపడనుంది.
పాక్ టాప్ ఆర్డర్ ఫ్లాప్..
పాకిస్థాన్ కు ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోనే తొలి దెబ్బ తగిలి ఇరామ్ జావేద్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ కు చేరుకుంది. ఆమె మేఘనా సింగ్ అవుట్ చేసింది. దీని తర్వాత 9వ ఓవర్లో స్నేహ రానా పాకిస్థాన్‌కు 2 దెబ్బలు తీసింది. మొదట ఆమె 17 పరుగుల వద్ద కెప్టెన్ బిస్మాహ్ మరూఫ్‌ను అవుట్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా సెట్ అయిన మునిబా రాణా 32 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 3 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో జరిగిన గత 4 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టు అజేయంగా నిలిచింది.
రెండు జట్లలో ప్లేయింగ్-11 భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తిక భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, ఎస్. మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ రాణా, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్.
పాకిస్థాన్: ఇరామ్ జావేద్, మునిబా అలీ, ఒమానియా సోహైల్, బిస్మాహ్ మహ్రూఫ్ (కెప్టెన్), అలియా రియాజ్, అయేషా నసీమ్, కైనత్ ఇంతియాజ్, ఫాతిమా సనా, తుబా హసన్, డయానా బేగ్, అనమ్ అమీన్.