WI vs IND: తొలి టీ20 ఓటమితో వెస్టిండీస్‌కు మరో షాక్.. అలా చేయడంపై థర్డ్ అంపైర్ ఏం చేశాడంటే?

భారత్‌తో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్ జట్టు ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కూడా ఎదుర్కొంది.

WI vs IND: తొలి టీ20 ఓటమితో వెస్టిండీస్‌కు మరో షాక్.. అలా చేయడంపై థర్డ్ అంపైర్ ఏం చేశాడంటే?
Wi Vs Ind
Follow us

|

Updated on: Jul 31, 2022 | 2:54 PM

వెస్టిండీస్ ఆటగాళ్ల జేబులకు చిల్లు పడింది. అదేంటి, మ్యాచ్ ఓడితే, జేబుకు సంబంధమేంటని ఆలోచిస్తున్నారా. అక్కడికే వస్తున్నాం. భారత్‌తో జరిగిన మొదటి T20Iలో , వెస్టిండీస్ జట్టు ఓటమిని ఎదుర్కోవడమే కాకుండా, స్లో ఓవర్ రేట్ కారణంగా వారికి జరిమానా కూడా పడింది. అంటే, మ్యాచ్ ఓడిపోవడంతోపాటు వారికి వచ్చే మ్యాచ్ ఫీజులో కూడా కోత పడిందన్నమాట. దీంతో ఒకే మ్యాచ్‌లో రెండు నష్టాలను చవిచూశారు. నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తగ్గించినందుకు వెస్టిండీస్ జట్టుకు జరిమానా పడింది. దీని కింద వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. ట్రినిడాడ్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి వన్డే తర్వాత మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ ఈ చర్య తీసుకున్నారు. ICC ప్రవర్తనా నియమావళిలోని సెక్షన్ 2.22 జట్టు స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినట్లు తేలితే మ్యాచ్ ఫీజులో 20 శాతం తగ్గింపును పేర్కొంది.

తప్పును అంగీకరించిన నికోలస్ పూరన్..

స్లో ఓవర్ రేట్ విషయంలో తాను చేసిన తప్పును వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ అంగీకరించాడు. కాబట్టి, ఇప్పుడు ఈ విషయంలో తదుపరి విచారణ లేదా చర్య అవసరం లేదు. స్లో ఓవర్ రేట్‌పై ఫీల్డ్ అంపైర్ ఫిర్యాదు చేశారు.

తొలి టీ20లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం..

భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆగస్టు 1న జరగనుంది. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్‌తో పాటు, దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు.

తొలి టీ20లో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దానికి సమాధానంగా అర్ష్‌దీప్‌ సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌ల బలమైన బౌలింగ్‌ ముందు వెస్టిండీస్‌ జట్టు కేవలం 122 పరుగులకే ఆగిపోయి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన