CWG 2022: కరోనా బారిన భారత హకీ జట్టు.. సీడబ్ల్యూజీ నుంచి దూరమైన స్టార్ ప్లేయర్..
జులై 29న జరిగిన గ్రూప్ స్టేజ్‌లోని మొదటి మ్యాచ్‌లో భారత్ ఘనాను ఓడించింది. ఆ తర్వాత జులై 30 శనివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆ జట్టు వేల్స్‌తో తలపడుతుంది.
బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల హాకీ జట్టు తన మ్యాచ్‌కు ముందు కరోనా కేసులు వెలుగు చూశాయి. ఆ జట్టు స్టార్ ప్లేయర్ నవ్‌జోత్ కౌర్ కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. బర్మింగ్‌హామ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, జులై 30 శనివారం, జట్టు స్టార్ ప్లేయర్ నవ్‌జోత్ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. దీని కారణంగా ఆమె టీంనుంచి నిష్క్రమించింది. నవజ్యోత్ బారిన పడడంతో టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. శనివారం రాత్రి జరిగే గ్రూప్ దశలో భారత జట్టు తన రెండో మ్యాచ్‌లో వేల్స్‌తో తలపడాల్సి ఉంది.
సోనికాకు చోటు..
నవజోత్‌కు ఇన్‌ఫెక్షన్ లక్షణాలు తేలడంతో ఆమె జులై 31 ఆదివారం నాడు దేశానికి తిరిగి వస్తుంది. నవజ్యోత్ స్థానంలో సోనికను జట్టులోకి తీసుకున్నారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం, 27 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ గత రెండు రోజులుగా ఐసోలేషన్‌లోనే ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ, ఆమె ఇకపై గేమ్స్‌లో పాల్గొనలేదు. ఒక రోజు ముందు ఘనాపై భారత్ 5-0తో విజయం సాధించింది. ప్రస్తుతం రెండవ మ్యాచ్ వేల్స్‌తో జరగాల్సి ఉంది.
ఆరోగ్యం బాగానే ఉంది.. కానీ, దేశానికి తిరిగి రావాల్సిందే..
భారత హాకీ జట్టుకు సంబంధించి వార్తా సంస్థ PTI, “ఆమె ఐసోలేషన్‌లోనే ఉంది. ఆమె మొదటి పరీక్ష సానుకూలంగా వచ్చింది. కానీ, రెండవ పరీక్షలో ఫలితం సానుకూలంగానే వచ్చింది. కానీ, గేమ్స్ రూల్స్ ప్రకారం ఆమె భారత్‌కు తిరిగి చేరుకోవాల్సిందే” అని పేర్కొంది.
భారత్ తరపున 200కు పైగా మ్యాచ్‌లు ఆడిన నవజోత్ కౌర్ 2014, 2018 CWGలో భారత జట్టులో కూడా భాగమైంది. ఇది కాకుండా, టోక్యో ఒలింపిక్స్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన జట్టులో ఆమె ప్రత్యేక సభ్యురాలిగా కూడా ఉంది.
మూడో కరోనా కేసు..
కామన్వెల్త్ గేమ్స్ కోసం బర్మింగ్‌హామ్ చేరుకున్న తర్వాత భారత జట్టులో కరోనా ఇన్ఫెక్షన్ సోకిన తొలి కేసు ఇదే. అయితే, ఇక్కడికి రాకముందే, భారత మహిళా క్రికెట్ జట్టులోని ఇద్దరు సభ్యులు, పూజా వస్త్రాకర్, ఎస్ మేఘన వ్యాధి బారిన పడ్డారు. జట్టుతో కలిసి వెళ్లలేకపోయారు. ఇప్పుడు ఇద్దరూ ఫిట్‌గా ఉన్నారు. మేఘన జట్టులో చేరగా, ఆగస్టు 3న బార్బడోస్‌తో జరిగే మూడో మ్యాచ్‌లోపు పూజ జట్టులో చేరే అవకాశం ఉంది.