ముగిసిన బంగ్లాదేశ్ బ్యాటింగ్.. భారత లక్ష్యం 154

రాజ్‌కోట్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు లిట్టన్ దాస్ (29: 21 బంతుల్లో 4×4), నయిమ్ తొలి వికెట్‌కి 7.2 ఓవర్లలోనే 60 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ దాస్ […]

ముగిసిన బంగ్లాదేశ్ బ్యాటింగ్.. భారత లక్ష్యం 154
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2019 | 9:56 PM

రాజ్‌కోట్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు లిట్టన్ దాస్ (29: 21 బంతుల్లో 4×4), నయిమ్ తొలి వికెట్‌కి 7.2 ఓవర్లలోనే 60 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చారు. అయితే లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ దాస్ రనౌటవగా.. నయిమ్‌ని వాషింగ్టన్ సుందర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్ (30: 20 బంతుల్లో 2×4, 1×6), మహ్మదుల్లా (30: 21 బంతుల్లో 4×4) మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. కానీ.. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్‌ని గెలిపించిన ముష్ఫికర్ (4: 6 బంతుల్లో) ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్; వాసింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఓ స్టంపింగ్ తప్పిదానికి పాల్పడగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సులువైన క్యాచ్‌ని జారవిడిచాడు. ఇక తొలి టీ20లో తాను వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి నాలుగు బంతులకి నాలుగు ఫోర్లు సమర్పించుకున్న ఖలీల్ అహ్మద్.. రెండో టీ20లో తాను వేసిన తొలి ఓవర్ మొదటి మూడు బంతులకీ మూడు ఫోర్లు ఇచ్చేశాడు. దీంతో.. టీ20ల్లో వరుసగా ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డ్ నెలకొల్పాడు. భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.