పిల్లల కోసం #8510.. ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంపెయిన్..
ఆధునిక కాలంలో చాలా మంది పిల్లలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారు. అంతేకాకుండ పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ ఓ ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. పిల్లల ఆరోగ్యమే ప్రధాన కర్తవ్యంగా #8510 హెల్త్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ కలిసి #8510 ఆరోగ్య ప్రచారానికి నాంది పలికాయి.
హైదరాబాద్: ఆధునిక కాలంలో చాలా మంది పిల్లలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారు. అంతేకాకుండ పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ ఓ ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. పిల్లల ఆరోగ్యమే ప్రధాన కర్తవ్యంగా #8510 హెల్త్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నాయి. పిల్లల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ కలిసి #8510 ఆరోగ్య ప్రచారానికి నాంది పలికాయి. #8-5-1-0 నియమం అనేది పాఠశాలకు వెళ్లే పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించిన పోషకాహారం, వ్యాయామం, విశ్రాంతి అంశాలను కలిగి ఉంటుంది. పాఠశాలకు వెళ్లే పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో, 8-5-1-0 (లేదా ‘ఆరోగ్య సిద్ధాంతం’ లేదా ‘ఆరోగ్య మంత్రం’ లేదా ‘ఆరోగ్య సూత్రం’) ఆరోగ్య నియమం ప్రవేశపెట్టబడింది. పిల్లలకు సరైన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను అందించే పద్దతులపై దృష్టి సారిస్తూ ఈ నియమాన్ని రూపొందించారు. పోషకాహారం, వ్యాయామం, విశ్రాంతికి సంబందించిన ఈ నియమావళి, పిల్లల సంక్షేమంలో పెద్ద మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పాటు, పిల్లలకు ఆరోగ్య సంబంధిత మార్గనిర్దేశం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు, పాఠశాల అధికారులకు ఒక ఆచరణాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ కలిసి హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ చర్చ, సమావేశంలో 20 మందికి పైగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని ఈ వినూత్న, ఆచరణాత్మక నియమం గురించి చర్చించారు.
‘8’ నియమం, ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని సిఫార్సు చేస్తోంది. ‘రూల్ ఆఫ్ 5’, సమతుల్య ఆహారం ప్రాముఖ్యతను వివరిస్తుంది. ప్రతిరోజూ ఐదు సేర్విన్గ్స్ (~400gm) పండ్లు, కూరగాయలను తినడం గురించి నొక్కి చెబుతుంది. నియమం ‘1’, ప్రతిరోజూ కనీసం ఒక గంట వ్యాయామం చేయాలని నొక్కి చెబుతుంది. నియమం ‘0’, ఎలాంటి అనారోగ్యకరమైన ఆహారాలను తినకూడదని, ఆహరం వృధా చేయటాన్ని సహించరాదని, స్క్రీన్ సమయాన్ని తగ్గించాలని నొక్కి చెబుతుంది. #8-5-1-0 ఆరోగ్య నియమావళి పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాలైన ఆందోళనలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఈ ప్రాక్టికల్ రూల్ ప్రకటన “లివ్ బెటర్ అండ్ ఛూజ్ బెటర్” క్యాంపెయిన్, కంట్రీ డిలైట్ నమ్మకానికి అనుగుణంగా ఉంది. కంట్రీ డిలైట్ మెరుగైన ఆహార ఎంపికల ద్వారా జనాభాకు ఆరోగ్యకరమైన జీవనశైలిని తెలియపరచడం, ప్రోత్సహించడంలో ముందంజలో ఉంది.
ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ CEO, FSSAI మాజీ CEO అయిన పవన్ అగర్వాల్ మాట్లాడుతూ.. “సమాజ శ్రేయస్సు సంరక్షకులుగా, మన భవిష్యత్తును రూపొందించడంలో పిల్లల ఆరోగ్యం కీలక పాత్రను మేము గ్రహించాము. అందుకే మేము వారి కోసం ఆరోగ్యం, క్షేమానికి సంబంధించిన 8-5-1-0 నియమాన్ని రూపొందించాము. ఈ ఆరోగ్య నియమాల్ని దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు పెద్ద ఎత్తున చేరవేయాలని, పాఠశాలలు ఈ ఆరోగ్యకరమైన ఫార్ములాలను అర్థం చేసుకోవడంలో, అవలంబించడంలో సహాయపడాలని కంట్రీ డిలైట్, ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ కోరుకుంటున్నాయి.
కొత్త హెల్త్ రూల్‌పై వ్యాఖ్యానిస్తూ, కంట్రీ డిలైట్ సహ వ్యవస్థాపకుడు, CEO అయిన చక్రధర్ మాట్లాడుతూ.. “భారతదేశం మరింత మెరుగ్గా జీవించడంలో సహాయం చేయడమే కంట్రీ డిలైట్ మిషన్.. పవన్ అగర్వాల్‌తో కలిసి పని చేసి 8-5-1-0 నియమాన్ని ప్రవేశపెట్టడానికి మేము చాల ఉత్సాహాంగా ఉన్నాము. మేము (కంట్రీ డిలైట్) 8-5-1-0 సూత్రాన్ని మనస్పూర్తిగా స్వీకరించాము. భారతదేశ భవిష్యత్తుకు మూలస్తంభాలైన నేటి బాలల అభ్యున్నతికి (మెరుగైన, ఆరోగ్యకరమైన, ఎక్కువ కాలం, మరింత సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి కోసం )కృషి చేస్తున్నాము.”
8510 నియమం రౌండ్‌టేబుల్ చర్చని FFF, కంట్రీ డిలైట్ హైదరాబాద్‌లోని అంతర్జాతీయ న్యూట్రి-సెరియల్ కన్వెన్షన్ సందర్భంగా నిర్వహించాయి. ఈ రౌండ్ టేబుల్ నిర్వహణలో మిల్లెట్ బ్యాంక్ వ్యవస్థాపకులు విశాలా రెడ్డి (అనధికారికంగా మిల్లెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని ప్రసిద్ధి) సహకరించారు.
ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ గురించి..
ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్ పర్యావరణ క్షీణతను నిరోధించడంతోపాటు జీవవైవిధ్యాన్ని కాపాడుతూ ఆహార భద్రతను సాధించడానికి స్థాపించబడింది. ఈ లక్ష్యాన్ని 2030 నాటికి ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG) 2030 లో భాగంగా సాధించడానికి ప్రయత్నిస్తుంది.
కంట్రీ డిలైట్ గురించి..
కంట్రీ డిలైట్ అనేది వినియోగదారులపై దృష్టి సారించే ఫామ్ ఫ్రెష్-టు-హోమ్ బ్రాండ్. కంట్రీ డిలైట్ ప్రధాన విలువలు, వినియోగదారుడికి మొదటి ప్రాధాన్యత, సాంకేతికతతో కూడిన సమస్య పరిష్కారం, యాజమాన్యం-ఆధారిత టీమ్ నిర్మాణం. కంట్రీ డిలైట్ స్థిరమైన వేగంతో అభివృద్ధి చెందుతూనే ఉంది. నేడు 2000 మంది ఉద్యోగులను మరియు పంపిణీ నెట్‌వర్క్‌లో దాదాపు 7000+ భాగస్వాములను కలిగి ఉంది. కంట్రీ డిలైట్‌ని 2015లో చక్రధర్ గాదె (CEO – సహ వ్యవస్థాపకుడు) ప్రారంభించారు. ఆయన IIM నుండి పట్టభద్రుడయ్యారు. ఇన్ఫోసిస్‌లో తన వృత్తిని ప్రారంభించాడు, ఆర్థిక సేవల సంస్థ, ఇండెక్స్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌లో పని చేయడం ప్రారంభించారు. కంట్రీ డిలైట్ రెండవ వ్యవస్థాపకుడు, నితిన్ కౌశల్ (COO – సహ వ్యవస్థాపకుడు) కూడా IIM నుంచి పట్టభద్రుడయ్యారు. వారు ఇరువురు 2005-07 బ్యాచ్‌లో IIM ఇండోర్‌లో కలిసి చదువుకున్నారు. 2017లో కంట్రీ డిలైట్‌ని ప్రారంభించడానికి ముందు పెట్టుబడులు, బ్యాంకింగ్‌లో పనిచేశారు. ప్రారంభమైనప్పటి నుంచి కంట్రీ డిలైట్ కస్టమర్-సెంట్రిక్ విధానాన్ని కొనసాగించింది. సాంకేతికతతో నడిచే సమస్య-పరిష్కార విధానాన్ని అవలంబించింది. కంట్రీ డిలైట్ పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పప్పులు, స్టేపుల్స్ ఉత్పత్తులని కస్టమర్స్ కి అందిస్తుంది. ఇతర ప్రాంతీయ మార్కెట్లలోకి విస్తరించాలని చూస్తోంది.
మరింత సమాచారం కోసం సంప్రదించండి:
Amit Sharma
+91-9999-448-552
amit.sharma@mslgroup.com