Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు శ్రీనిధి.. B.Tech CSE కొత్త కోర్సులతో ప్రపంచ మార్కెట్ తో పోటీకి సై..

నేటి ఆధునిక యుగం, ప్రపంచంలో వేగంగా మారుతున్న సాంకేతిక నైపుణ్యాల దృష్ట్యా కోడింగ్‌ నుండి స్మార్ట్, స్కేలబుల్ సొల్యూషన్‌లతో వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఇక్కడి విశ్వవిద్యాలయంలో వృత్తి, వ్యాపారాలు సజావుగా నడవడానికి, సమయానికి తగినట్టు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మారుతున్న మార్కెట్లకు మెరుగ్గా స్పందించడానికి సహాయపడే ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. ముఖ్యంగా

మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు శ్రీనిధి.. B.Tech CSE కొత్త కోర్సులతో ప్రపంచ మార్కెట్ తో పోటీకి సై..
Sreenidhi University
Follow us
Jyothi Gadda

| Edited By: TV9 Telugu

Updated on: May 22, 2025 | 12:37 PM

శ్రీనిధి విశ్వవిద్యాలయం.. మీ పిల్లల భవిష్యత్తుకు నిజంగానే మెరుగైన బాటలు వేస్తున్న గొప్ప నిధిగా చెప్పాలి. శ్రీనిధి విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అన్ని రకాల కోర్సులను అందిస్తోంది. విశ్వవిద్యాలయం UG స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లలో BTech కోర్సులను అందిస్తుంది. నేటి ఆధునిక యుగం, ప్రపంచంలో వేగంగా మారుతున్న సాంకేతిక నైపుణ్యాల దృష్ట్యా కోడింగ్‌ నుండి స్మార్ట్, స్కేలబుల్ సొల్యూషన్‌లతో వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది. ఇక్కడి విశ్వవిద్యాలయంలో వృత్తి, వ్యాపారాలు సజావుగా నడవడానికి, సమయానికి తగినట్టు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, మారుతున్న మార్కెట్లకు మెరుగ్గా స్పందించడానికి సహాయపడే ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. ముఖ్యంగా క్లౌడ్-ఆధారిత ఇఆర్‌పి (ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) – వ్యవస్థలు ఉన్నాయి. క్లౌడ్ ఇఆర్‌పిలో ప్రత్యేకత కలిగిన శ్రీనిధి విశ్వవిద్యాలయం బి.టెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (సిఎస్‌ఇ) ఈ కొత్త యుగం కోసం రూపొందించబడిన ప్రోగ్రామ్.

చిరు వ్యాపారాల నుండి ప్రపంచ మార్కెట్‌ వరకు ప్రతిదీ నిర్వహించడానికి ఎంటర్‌ప్రైజ్ వ్యవస్థలపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం క్లౌడ్ ERP సొల్యూషన్‌లను ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. SAP-నైపుణ్యం కలిగిన నిపుణులకు ఉన్న భారీ డిమాండ్‌ను గుర్తించి శ్రీనిధి విశ్వవిద్యాలయం ఒక ప్రత్యేకమైన అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ విద్యార్థులకు కోడ్ చేయడం ఎలాగో నేర్పించడమే కాకుండా నిజమైన ఎంటర్‌ప్రైజ్ వాతావరణాలలో వారి నైపుణ్యాలను ఎలా ఉపయోగించాలో కూడా నేర్పిస్తున్నారు. .

B.Tech CSE – (క్లౌడ్ ERP) ప్రోగ్రామ్ నాలుగు సంవత్సరాలకు పైగా నడుస్తుంది. ఇందులో ప్రతి ఒక్కటి ఆచరణాత్మక విలువతో నేర్పిస్తారు. మొదటి సంవత్సరంలో విద్యార్థులు SAP S/4HANA ఉపయోగించి వ్యాపార ప్రక్రియల గురించి నేర్చుకుంటారు. వ్యాపార ప్రక్రియ ఇంటిగ్రేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన SAP సర్టిఫికేషన్‌ను పొందుతారు. రెండవ సంవత్సరం ABAP క్లౌడ్‌లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ విద్యార్థులు బ్యాకెండ్ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలను నేర్చుకుంటారు. బ్యాకెండ్ డెవలప్‌మెంట్‌లో మరొక SAP సర్టిఫికేషన్ అనుసరిస్తుంది.

ఇవి కూడా చదవండి

మూడవ సంవత్సరం మరింత ఆసక్తికరంగా మారుతుంది. SAP ఫియోరి ద్వారా యూజర్-ఫ్రెండ్లీ అప్లికేషన్‌లను ఎలా సృష్టించాలో, ప్రపంచవ్యాప్తంగా SAP ప్రాజెక్టులలో ఉపయోగించే ప్రాజెక్ట్ నిర్వహణ, అమలు పద్దతి అయిన SAP యాక్టివేట్ గురించి అవగాహన పొందడం ఎలాగో విద్యార్థులు నేర్చుకుంటారు. ఇక నాలుగో సంవత్సరం ఫైనల్‌ ఇయర్‌లోకి అడుగు పెడతారు. కేవలం థియరీ-హెవీ తరగతులకు బదులుగా, శ్రీనిధిలోని విద్యార్థులు SAP భాగస్వామి లేదా క్లయింట్ కంపెనీతో పూర్తి ఏడాది కాలం పాటు ఇంటర్న్‌షిప్ చేస్తారు. ఇక్కడ వారు నిజమైన ప్రాజెక్టులపై పని చేస్తారు. పరిశ్రమలో ఎంటర్‌ప్రైజ్ టెక్ ఎలా ఉపయోగించబడుతుందో ప్రత్యక్షంగా చూస్తారు. నేర్చుకుంటారు.

B Tech డిగ్రీ ముగిసే సమయానికి, విద్యార్థులు గ్లోబల్ SAP సర్టిఫికేషన్‌లతో పాటు CSE డిగ్రీని పొందుతారు. ఈ రంగంలో వాస్తవ పని అనుభవాన్ని సంపూర్ణంగా నేర్చుకుంటారు. అందుకే శ్రీనిధి విద్యార్థులకు ఎన్నో అవకాశాలను కల్పించే ఒక అరుదైన కలయిక.

ఇక్కడ విద్యార్థులు ముఖ్యమైన విషయాలను అధ్యయనం చేస్తారు. కోర్ CSE సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు. ప్రోగ్రామింగ్ (పైథాన్, జావా మొదలైన భాషలలో) డేటా స్ట్రక్చర్‌లు, అల్గోరిథంలు వెబ్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ , డేటాబేస్ మేనేజ్‌మెంట్ ,సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అనేక కోర్సుల్లో విద్యార్థులను ప్రతిభ వంతులుగా చేస్తుంది. ఇది వారికి ERP-సంబంధిత జ్ఞానాన్ని మాత్రమే కాకుండా పూర్తి స్థాయి నైపుణ్యాలను నేర్పిస్తుంది. మీ పిల్లల్ని బహుముఖ ప్రజ్ఞ, పరిశ్రమ రంగంలో అన్ని విదాలా సంసిద్ధులను చేస్తుంది. ఇక్కడ బీటెక్‌ పూర్తి చేసిన ఎంతోమంది ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్లు తమ నైపుణ్యాల కోసం ఎదురు చూస్తున్న బహుళ కంపెనీల్లోకి అడుగుపెడుతున్నారు.

ఇక్కడ పట్టా పొందిన విద్యార్థులు ఎక్కువగా SAP, IBM, Capgemini, Deloitte, Infosys, PwC, అనేక ఇతర కంపెనీలు క్లౌడ్ ERP, SAP ప్లాట్‌ఫారమ్‌లో నిపుణులైన వారిని నియమించుకుంటున్నాయి. SAP ABAP డెవలపర్, SAP Fiori డెవలపర్, క్లౌడ్ ERP స్పెషలిస్ట్, ERP బిజినెస్ అనలిస్ట్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ ఇంజనీర్‌ వంటి పదవుల్లో వారు స్థానం సంపాదించుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.