AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Masam:అష్టైశ్వర్యాలు కురిపించే వ్రతం.. కార్తీక‌మాసంలోనే ఎందుకు చేయాలో తెలుసా?

కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత శ్రేష్ఠమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివారాధన, దీపారాధనలతో పాటు, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. ఈ పవిత్ర మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించే విధానం, దాని వలన కలిగే ప్రయోజనాలను గురించి వివరంగా తెలుసుకుందాం.

Karthika Masam:అష్టైశ్వర్యాలు కురిపించే వ్రతం.. కార్తీక‌మాసంలోనే ఎందుకు చేయాలో తెలుసా?
Satyanarayana Vratam Karthika Pournami
Bhavani
|

Updated on: Oct 30, 2025 | 6:43 PM

Share

ఆధ్యాత్మికంగా ఎంతో శ్రేష్ఠమైన ఈ కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం, దీపారాధన చేయడం వలన శుభాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. ఈ వ్రతం ఆచరించే విధానం, దాని ప్రయోజనాలు ఇక్కడ చూడండి. కార్తీక మాసం… ఎంతో శ్రేష్ట‌మైన మాసం. ఈ మాసంలో శివ కేశవుల ఆరాధన, దీపారాధనలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

కార్తీక దీపారాధన నియమాలు

ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒకే వత్తిని ఉపయోగించడం కూడదని పెద్దలు చెబుతారు.

కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వత్తులు కలిపి వేయడం శ్రేయస్కరం.

ఈ వత్తుల కోసం తామర నార, అరటి నార వంటివి ఉపయోగించాలని సూచిస్తారు.

సత్యనారాయణ వ్రతం ప్రాముఖ్యత

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసంలో అభిషేకాలు, బిల్వ అర్చన, స్తోత్ర పారాయణాలు, శివ నామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి.

వ్రతం ఆచరించాల్సిన దినాలు, విధానం

ఈ వ్రతాన్ని ఆచరించడానికి కేవలం కార్తీక పౌర్ణమి మాత్రమే కాకుండా, ఈ క్రింది దినాలలో కూడా ఆచరించవచ్చు:

శుభ దినాలు: కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో లేదా ఏదైనా ఇతర శుభ దినాన ఈ వ్రతాన్ని చేయవచ్చు.

సమయం: సాయంకాలం కానీ, ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి వ్రతానికి సిద్ధం కావాలి.

ప్రదేశం: దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్రతీరాన కానీ, నదీతీరాన కానీ, లేదా స్వగృహమున కానీ వ్రతం చేయించాలి.

నియమాలు: బ్రాహ్మణులను, బంధుమిత్రాదులను రప్పించి వ్రతం చేయాలి.

పూజా స్థలాన్ని గోమయముచే శుద్ధిచేయాలి.

తూర్పుగా బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి, మంటపమును మామిడాకుల తోరణములతో అలంకరించాలి.

రాగిపాత్ర, నూతన వస్త్రాలు, కొబ్బరికాయ వంటి పూజా ద్రవ్యాలను సిద్ధం చేయాలి.

భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి.

వ్రత ఫలితాలు

ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా:

కష్టనష్టాలు తొలగిపోతాయి.

ధనధాన్యాలకు లోటు ఉండదు.

సౌభాగ్యకరమైన సంతానం లభిస్తుంది.

సర్వత్రా విజయం లభిస్తుంది.

దారిద్ర్యం తొలగిపోవాలంటే.. ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి.

ఈ వ్రతాన్ని మాఘ, వైశాఖ, కార్తీక మాసములందు కానీ, ఏదైనా శుభదినాన ఆచరించవచ్చు.