AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulsi Plant: మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే వెంటనే ఇలా చేయండి, లేకుంటే..

సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్ళు అంసపూర్ణమని భావిస్తారు. ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసికోట కట్టించి అందులో నాటతారు. తులసికోటకు..

Tulsi Plant: మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే వెంటనే ఇలా చేయండి, లేకుంటే..
Tulsi Plant
Sanjay Kasula
|

Updated on: Jan 13, 2023 | 8:44 PM

Share

ఔషధీ పరంగానూ, సనాతన సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క తులసి. మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది. కానీ తులసి మొక్కను ఇంట్లో పెట్టుకునేవారు కొన్ని  నియమాలను తప్పుకుండా పాటించాలి. షోడశోపచార పూజా విద్ధానములో తులసికి విశిష్ట స్థానం ఉంది.నేడు విదేశీయులు సైతం తులసిలోని విశేషమును అంగీకరించుచున్నారు. పరమపవిత్రమైనదిగా భావించే తులసి కోట అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఈ పత్రి తులసీ వృక్షానికి చెందినది.

తులసి మొక్క ఎండిపోయినప్పుడు ఏం చేయాలో చాలా తక్కువ మందికి సరైన సమాచారం ఉంది. చాలా పవిత్రమైనది. పూజనీయమైనదిగా భావించే తులసి మొక్కను నిబంధనల ప్రకారం ఉంచడం.. తొలగించడం అవసరం. లేకపోతే మా లక్ష్మి, విష్ణువు కోపం తెచ్చుకోవచ్చని నమ్ముతారు. దీనివల్ల జీవితం పేదరికం, దుఃఖం, సమస్యలు చుట్టుముడుతుంది.

సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్ళు అంసపూర్ణమని భావిస్తారు. ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసికోట కట్టించి అందులో నాటతారు. తులసికోటకు నలువైపులా దేవతాచిత్రాలు ఉండి నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్ళు ఉంటాయి. కొన్ని ఇళ్ళలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతారు. ఒక చిన్నపాటి పొదలాగా పెరిగిన దీన్ని తులసీవనం లేదా తులసీ బృందావనం అని పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

అలాంటి తులసితో ఏం చేయాలి? 

తులసికి నీటిని నైవేద్యంగా పెట్టి రోజూ పూజిస్తే లక్ష్మి తల్లి ప్రసన్నురాలవుతుంది. మరోవైపు, తులసి మొక్క ఎండిపోవడం కూడా అనేక సూచనలను ఇస్తుంది. ఉదాహరణకు, ఆకుపచ్చ తులసి అకస్మాత్తుగా ఎండిపోతే.. అది ఒక రకమైన సంక్షోభం లేదా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. అటువంటి సమంయలో కొంత అప్రమత్తంగా ఉండండి. అయితే, కొన్నిసార్లు వాతావరణ ప్రభావం కారణంగా మొక్క ఎండిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తులసి మొక్క ఏదైనా కారణం చేత ఎండిపోతే ఇలా వదిలేయకండి. అలా కాకుండా, మత గ్రంథాలలో పేర్కొన్న నియమాలను అనుసరించి.. వాటిని వెంటనే తొలగించండి. లేకపోతే, ఎండిన తులసి మొక్క అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఎండు తులసి మొక్క ఉంటే అశుభం.

  • ఎండిపోయిన తులసి మొక్కను గౌరవంగా తొలగించండి. స్నానం చేసిన తర్వాత మాత్రమే దాన్ని తాకండి. కుండి నుంచి తులసి మొక్కను వేరుతో పాటు తీసి పవిత్ర నది, చెరువు లేదా పవిత్ర జలాశయంలో ముంచండి. అయితే ఆదివారం లేదా ఏకాదశి రోజు ఈ పని చేయకండి. ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసిని ముట్టకూడదు.
  • పాత మొక్క స్థానంలో కొత్త మొక్కను నాటండి. కొత్త తులసి మొక్కను నాటడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు  అనంతమైన అనుగ్రహం లభిస్తుంది. అంతే కాకుండా శుక్రవారం కూడా తులసి మొక్కను నాటడం శ్రేయస్కరం.
  • తులసి కుండి నేల కూడా శుభప్రదమే. కొత్త తులసి మొక్కను నాటే వరకు, తులసి కుండను కూడా పూజించవచ్చు. మీరు కుండిలోని మట్టిని మారుస్తుంటే.. ఆ మట్టిని గౌరవంగా ఎక్కడో ఒక చోట ఉంచండి.. దాన్ని మురికిలో పడేయడం తప్పు.
  • రామ తులసి ఇంట్లో నాటడానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రామ తులసి మాత్రమే నాటితే బాగుంటుంది. అలాగే తులసి మొక్కను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచండి. ఈ మొక్కను దక్షిణ దిశలో నాటవద్దు.
  • తులసి పూజ చేస్తే మాంగల్యం చిరకాలం నిలుస్తుంది. తులసి ఉన్నచోట దుష్ట శక్తులు ప్రవేశించవు. ఉదయాన్నే తులసిని దర్శించుకుంటే పాపాలు నశిస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం

ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి