Khairatabad Ganesh 2021: ఖైర‌తాబాద్‌ గణపయ్య ఎత్తు.. వెడల్పు.. బరువు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఎంటో తెలుసా..

వినాయ‌క చ‌వితి అంటే మ‌న‌కు హైద‌రాబాద్ గుర్తుకు వ‌స్తుంది. హైద‌రాబాద్‌లో వేలాది మండ‌పాల్లో విఘ్నేశ్వరుడు కొలువుదీరుతాడు. అన్నింటికంటే స్పెష‌ల్ ఎట్రాక్షన్‌గా క‌నిపించే...

Khairatabad Ganesh 2021: ఖైర‌తాబాద్‌ గణపయ్య ఎత్తు.. వెడల్పు.. బరువు.. ఈ ఏడాది ప్రత్యేకతలు ఎంటో తెలుసా..
Khairatabad Ganesh 2021
Follow us

|

Updated on: Sep 08, 2021 | 12:42 PM

హైద‌రాబాద్‌లో వినాయ‌క చ‌వితి అంటే మ‌న‌కు టక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్ అని చెప్పాలి. ఆయనది ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. ఎత్తు పెరగటంలో ఎంతటి ప్రపంచ ప్రఖ్యాతో.. ఆయన ఎత్తు తగ్గడంలోనూ అంతే వార్తల్లో నిలుస్తుంటాడు. ఈసారికి గణపతి రూపేమిటి.? ఆ ప్రత్యేకత భక్తులకెప్పుడూ ఆసక్తికరమే. ప్రతి ఏడాది అడుగుచొప్పున పెంచుకుంటూ ఒక్కో ఏడాది ఒక్కో అవ‌తారంలో గ‌ణ‌ప‌య్య ద‌ర్శ‌నం ఇస్తుంటారు. గ‌తేడాది క‌రోనా కాలంలో కూడా మ‌హాగ‌ణ‌ప‌తిని చూసేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈ నెల 10న వినాయ‌క చ‌వితి కావ‌డంతో ఆ రోజు నుంచి 9 రోజుల పాటు న‌వ‌రాత్రులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి ఖైర‌తాబాద్‌లో వినాయకుడికి చాలా ప్రత్యేకతలున్నాయి.

మ‌హా గ‌ణ‌ప‌య్య‌ను చూసేందుకు…

వినాయ‌క చ‌వితి అంటే మ‌న‌కు హైద‌రాబాద్ గుర్తుకు వ‌స్తుంది. హైద‌రాబాద్‌లో వేలాది మండ‌పాల్లో వినాయ‌కులు కొలువుదీరుతారు. అన్నింటికంటే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా క‌నిపించే వినాయ‌కుడు మాత్రం ఖైర‌తాబాద్ వినాయ‌కుడే అని చెప్పాలి. ఎందుకంటే, ప్రతి ఏడాది అడుగుచొప్పున పెంచుకుంటూ ఒక్కో ఏడాది ఒక్కో అవ‌తారంలో గ‌ణ‌ప‌య్య ద‌ర్శ‌నం ఇస్తుంటారు.

గ‌తేడాది క‌రోనా కాలంలో కూడా మ‌హాగ‌ణ‌ప‌తిని చూసేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 10 వ తేదీన వినాయ‌క చ‌వితి కావ‌డంతో ఆ రోజు నుంచి 9 రోజుల పాటు న‌వ‌రాత్రులు నిర్వ‌హస్తారు.

ఇక ఈసారి ఖైర‌తాబాద్‌లో పంచ‌ముఖ రుద్ర‌మ‌హా గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు.  విగ్ర‌హం సిద్ధం కావ‌డంతో ఆయ‌న్ను ద‌ర్శించేందుకు పెద్ద ఎత్తున న‌గ‌ర ప్ర‌జ‌లు ఖైర‌తాబాద్‌కు తరలి వస్తున్నారు. ఏడాది 40 అడుగుల ఎత్తు, 23 అడుగుల వెడ‌ల్పు 28 ట‌న్నుల బ‌రువుతో ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని ఏర్పాటు చేశారు.

కోవిడ్ ఎఫెక్ట్‌తో..

తెలుగు రాష్ట్రల్లో  గణపతి ఉత్సవాల్లో ప్రత్యేకం స్థానం చోటు సంపాదించుకుంది ఖైరతాబాద్​ గణపతి విగ్రహం. ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఏటా భారీ ఖాయంలో దర్శనమిచ్చే వినాయకుడిపై కరోనా ప్రభావం పడింది. దీంతో గతేడాది నిడారంబరంగా ఉత్సవాలను నిర్వహించారు. 2020లో ఖైరతాబాద్ గణేశుడు ధన్వంతరి నారాయణ మహాగణపతి రూపంలో దర్శనమిచ్చారు.  కేవలం 9 అడుగుల ప్రతిమను ఉత్సవకమిటీ ప్రతిష్ఠించింది. అయితే కరోనా నేపథ్యంలో దర్శనానికి భక్తులెవరినీ అనుమతించలేదు.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు