Birth Date Astrology: జన్మించిన వారం బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.? ఎలాగంటే.!
Astrology: సాధారణంగా మనం పుట్టిన పిల్లలకు వారి పుట్టిన తేదీ, నక్షత్రం, సమయాన్ని బట్టి వారి జాతకాన్ని రాయిస్తాం. ఆ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే.?
సాధారణంగా మనం పుట్టిన పిల్లలకు వారి పుట్టిన తేదీ, నక్షత్రం, సమయాన్ని బట్టి వారి జాతకాన్ని రాయిస్తాం. ఆ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే.? పరిహారం ఏంటన్న విషయాలను పండితులను అడిగి తెలుసుకుంటాం. ఇదిలా ఉంటే జన్మించిన వారం ప్రకారం.. వ్యక్తిత్వాలను తెలుసుకోవచ్చునని అంటుంటారు. ఇది ఎంతవరకు సాధ్యం.! జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఏ వారంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో.? ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటారో.? ఇప్పుడు తెలుసుకుందాం..
సోమవారం:
సోమవారం చంద్రుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు. వారు ఎక్కువ పాజిటివ్‌గా ఉంటారు. ఎప్పుడూ సంతోషంగా, ఎక్కడికి వెళ్లినా ఆనందాన్ని పంచుతుంటారు.
మంగళవారం:
మంగళవారం ఆంజనేయస్వామికి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు. ఈరోజున జన్మించిన వారు హనుమంతుడిలా ఉదారంగా ఉంటారు. అవసరమైన వారికి ఎంతకైనా సహాయం చేయడానికి సిద్దం పడతారు. అయితే, వీరికి కోపం చాలా ఎక్కువ. ఇక వీరి స్వభావం గురించి మాట్లాడితే.. చాలా అమాయకులు, ఎవరిపైనా ద్వేషం పెట్టుకోరు.
బుధవారం:
బుధవారం వినాయకుడి రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున జన్మించినవారు చురుకుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లోనూ విజయాలను అందుకుంటారు. కుటుంబం పట్ల అంకితభావంతో ఉంటారు. వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వీరు ఏ విషయాన్ని మనసులో పెట్టుకుని పదేపదే దాని గురించి ఆలోచించరు.
గురువారం:
గురువారం జన్మించిన వ్యక్తులలో జ్ఞానం, మాటకారితనం ఎక్కువ. వీరి జీవితంలో డబ్బుకు కొదవు ఉండదు.
శుక్రవారం:
శుక్రవారం జన్మించిన వ్యక్తుల్లో ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు డబ్బును ఏమాత్రం లెక్కచేయకుండా ఖర్చు పెడుతూనే ఉంటారు. విందు, వినోదాల్లో పాల్గొవడం వీరి చాలా ఇష్టం.
శనివారం:
శనివారం జన్మించిన వ్యక్తులు ఎంతో నమ్మకంగా ఉంటారు. వీరి సంకల్ప బలం చాలా గొప్పది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనప్పటికీ.. మొండిగా వాటిని ఎదుర్కుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతారు. వారి శ్రమకు తగిన విజయం కూడా అందుతుంది. వీరితో స్నేహం చేయడం ఎంతో మంచిది.
ఆదివారం:
ఆదివారం జన్మించినవారు ఎంతో తెలివైనవారు. ఎన్నో విజయాలను అందుకుంటారు. కష్టాలు వచ్చినా.. ధైర్యంతో ఎదుర్కుని విజయాన్ని పొందుతారు. అయితే వీరు కొన్ని విషయాల్లో మొండి పట్టుదల పట్టడం వల్ల కొన్ని సమస్యలు కొనితెచ్చుకుంటారు.
Also Read:
తెలంగాణ: స్కూల్స్‌లో ఫిజికల్ క్లాసులు.. మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
ఈ బుడ్డోడికి సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే.. ఎవరో గుర్తుపట్టండి.!