Vastu Tips: పిల్లలు చదువుకునే సమయంలో ఏకాగ్రత పెరగాలంటే స్టడీ రూమ్‌కి ఈ రంగులను ఎంచుకోండి..

Vastu Tips: ఇంట్లో ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండి చదువుకోవడానికి అనుకూలంగా ఉండే గదిని స్టడీ రూమ్ అంటారు. ఈ స్టడీ రూమ్ లో చక్కని వాతావరణం తో పాటు..

Vastu Tips: పిల్లలు చదువుకునే సమయంలో ఏకాగ్రత పెరగాలంటే స్టడీ రూమ్‌కి ఈ రంగులను ఎంచుకోండి..
Vastu Tips
Follow us

|

Updated on: Jan 06, 2022 | 1:39 PM

Vastu Tips: ఇంట్లో ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉండి చదువుకోవడానికి అనుకూలంగా ఉండే గదిని స్టడీ రూమ్ అంటారు. ఈ స్టడీ రూమ్ లో చక్కని వాతావరణం తో పాటు ప్రశాంతంగా ఉండాలి. పిల్లలు చదువుకునే గదిలో అలంకరణ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. గది వాతావరణాన్ని అలంకరణ ప్రతిబింబిస్తుంది. అయితే పిల్లల చదువుకునే సమయంలో ఏకాగ్రత పెరగాలంటే ప్రశాంత వాతావరణంతో పాటు.. గదిలోని రంగులు కూడా దోహదం చేస్తాయి..  పిల్లల గదిలో సరైన రంగును ఎన్నుకోవాలి. వాస్తు దోషాలపై కూడా శ్రద్ధ వహించాలి. అంతేకాదు స్టడీ రూమ్ అలంకరణ సమయంలో ఇతర విషయాలపై కూడా శ్రద్ధ చూపాలి. పెయింట్ రంగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. రూమ్ లోని రంగు.. గది వాతావరణాన్ని నిర్ణయిస్తుంది.

1. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లలు చదువుకునే గదికి క్రీమ్ కలర్, లేత ఊదా, లేత ఆకుపచ్చ, నీలి ఆకాశం రంగు, లేత గులాబీ రంగులు మంచివి. ఈ రంగులు పిల్లల చదువుకునే సమయంలో మనసుని ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయి.

2. ఈ రంగులు ఏకాగ్రత, మానసిక , మేథస్సుకు చిహ్నంగా పరిగణించబడతాయి. కనుక  స్టడీ రూమ్‌కి ఈ రంగులను ఎంచుకోవడం వల్ల పిల్లల్లో మేధో సామర్థ్యం పెరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

3. స్టడీ రూమ్ కి ఎంచుకునే రంగులతో పాటు.. అలంకరణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా స్టడీ రూమ్ కోసం ఫోటోగ్రాఫ్‌లను ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టడీ రూమ్‌ లో పెట్టే ఫోటోలు పిల్లల మనసుని ప్రశాంతంగా ఉంచేలా.. చదువులో నిమగ్నమయ్యేలా చూసుకోవాలి.

Also Read:   చిరకాల స్నేహితుడికి నెమలి తుది వీడ్కోలు.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..