AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: ఇంటికి అందం తెస్తాయని ఇలాంటి ఫోటోలు గోడకు పెడితే ప్రతికూల శక్తికి ఆహ్వానం చెప్పినట్లే..

చాలా మంది తమ ఇళ్ల అందాన్ని పెంచడానికి అందమైన ఫోటోలను ఇళ్ల గోడలపై వేలాడదీస్తారు. తమ ఇళ్ల గోడలపై ప్రత్యేకంగా కనిపించే తాజ్ మహల్, బుద్ధుడు, పువ్వులు, జంతువుల ఫోటోలను వేలాడదీస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోలలో కొన్నింటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. కనుక వాస్తు ప్రకారం ఇంటి గోడలపై ఏ ఫోటోలను వేలాడదీయకూడదో చూద్దాం.

Vastu tips: ఇంటికి అందం తెస్తాయని ఇలాంటి ఫోటోలు గోడకు పెడితే ప్రతికూల శక్తికి ఆహ్వానం చెప్పినట్లే..
Vastu Tips
Surya Kala
|

Updated on: Jul 11, 2025 | 8:54 PM

Share

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి అందాన్ని పెంచేందుకు తమ ఇంటి గోడలపై వివిధ రకాల ఫోటోలను (గోడ ఫ్రేమ్‌లు) వేలాడదీస్తారు. ఈ ఫోటోలు ఇంటి అందాన్ని పెంచడమే కాదు ఇంట్లో సానుకూలత, ప్రతికూలతను వ్యాప్తి చేసే శక్తిని కలిగి ఉంటాయి. అవును కొన్ని ఫోటోలు ఇంటికి శ్రేయస్సును తెస్తాయి. అయితే ఇంట్లో వేలాడదీసిన కొన్ని ఫోటోలు ప్రతికూలతను వ్యాపింపజేస్తాయి. అయితే చాలా మందికి ఇంట్లో ఏ ఫోటోలు ఉంచాలో, ఏవి పెట్టుకోకూడదో తెలియదు. ఈ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాప్తి చేసే ఏ ఫోటోలు ఇంటి గోడలకు వేలాడదీయ కూడదో ఈ రోజు తెలుసుకుందాం..

ఇంటి గోడలపై ఎలాంటి ఫోటోలను వేలాడదీయకూడదంటే

యుద్ధ చిత్రాలు: యుద్ధానికి సంబంధించిన ఫోటోలు లేదా వేటకు సంబంధించిన చిత్రాలు ఇంట్లో ఉంచకూడదని అంటారు. అవి ఎల్లప్పుడూ ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి. ఇంట్లో అసమ్మతి పరిస్థితిని కూడా సృష్టిస్తాయి.

తాజ్ మహల్ ఫోటో: కొంతమంది ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ ఫోటోను ఇంట్లో ఉంచుకుంటారు. అయితే ఈ ఫోటోను ఇంట్లో ఉంచకూడదు. వాస్తు ప్రకారం సమాధి చిత్రాన్ని ఉంచుకోవడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుందని చెబుతారు.

ఇవి కూడా చదవండి

దూకుడుతో ఉన్న జంతువుల చిత్రాలు: బాధ, విచారం, కోపం భావాలను చూపించే ఫోటోలను ఇంటి గోడలపై వేలాడదీయకూడదు. అలాగే దూకుడు జంతువుల చిత్రాలను ఇంటి గోడలపై వేలాడదీయకూడదు. ఇవి ప్రతికూలతను పెంచుతాయి. కనుక ఎల్లప్పుడూ ఆనందాన్ని సూచించే ఫోటోలను మాత్రమే ఉంచుకోవాలి.

ఏడుస్తున్న శిశువు ఫోటో: ఇంటి గోడపై ఏడుస్తున్న శిశువు ఫోటోను ఎప్పుడూ వేలాడదీయకండి. అలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.

మునిగిపోతున్న ఓడ: కొంతమంది తమ ఇంటి గోడకు మునిగిపోతున్న ఓడ ఫోటోను వేలాడదీస్తారు. అయితే ఇలాంటి ఫోటోలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి అశాంతికి కారణమవుతాయి. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

గులాబీ మొక్క: కొంతమందికి గులాబీ మొక్కలు అంటే ఇష్టం. అందుకే తమ ఇంటి గోడపై గులాబీ మొక్కల ఫోటోను కూడా వేలాడదీస్తారు. అయితే, ముళ్ళు ఉన్న ఈ మొక్కల ఫోటో ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుందని, ఇది ఆర్థిక నష్టానికి కూడా దారితీస్తుందని చెబుతారు.

జలపాత చిత్రం: కొంతమంది ఇంట్లో గోడకు జలపాతాల ఫోటోలను వేలాడదీస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోలను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆర్థిక సంక్షోభానికి కారణమవుతుంది. నీరు ప్రవహించినట్లే ఇంటి నుంచి కూడా డబ్బు ప్రవహిస్తూ వెళ్ళిపోతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.