AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiss: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాయి? ఈ అందమైన అనుభూతి వెనుక రీజన్ ఏమిటంటే

ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకోవడం సహజం. ఇది బాహ్య ప్రపంచం నుంచి దూరంగా చేస్తూ భాగస్వామితో అనుబంధాన్ని పెంచుతుంది. కళ్ళు మూసుకోవడం వల్ల మెదడు ఆ అనుభూతిపై దృష్టి పెడుతుంది, సంతోష హార్మోన్లు విడుదలవుతాయి. లండన్ విశ్వవిద్యాలయం అధ్యయనం కూడా దీనిని ధ్రువీకరించింది. ఇది ప్రేమను మరింతగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.

Kiss: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు ఎందుకు మూసుకుంటాయి? ఈ అందమైన అనుభూతి వెనుక రీజన్ ఏమిటంటే
Kissing Science
Surya Kala
|

Updated on: Jul 11, 2025 | 6:32 PM

Share

వ్యక్తులు ఒకరికొకరు దగ్గరగా వచ్చినప్పుడు.. వారు శారీరక స్పర్శను అనుభూతి చెందడమే కాదు భావోద్వేగ సంబంధం కూడా బలపడుతుంది. ముఖ్యంగా ముద్దు పెట్టుకునేటప్పుడు ప్రజలు ప్రపంచాన్ని మరచిపోతారు. అలాంటి క్షణాల్లో తమ ఇంద్రియాలన్నింటినీ మరచిపోయి.. హృదయ స్పందనని మాత్రమే వింటారు. ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకోవడం సాధారణం. చాలా మంది దీనిని అనుభవిస్తారు. అయితే ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటాయనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు.

నిజానికి.. ముద్దు పెట్టుకునే సమయంలో కళ్ళు మూసుకుని ఆ క్షణాలను మరింత మధురంగా అనుభవించగలరు. ఈ క్షణం మిమ్మల్ని బాహ్య ప్రపంచం నుంచి దూరం చేస్తుంది. ఇష్టమైన వ్యక్తికి దగ్గర చేస్తుంది. మన ఇతర పనులు, ఇంద్రియాలు, చూడటం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం అన్నీ పక్కన పెట్టి.. ముద్దు పెట్టుకునే క్షణాన్ని మాత్రమే అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు ప్రేమ మాయాజాలం మరింత పెరుగుతుంది.

వాస్తవానికి కళ్ళు మూసుకుని ముద్దు పెట్టుకోవడం వల్ల మెదడు ఆ అనుభూతిపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. ఇది ప్రేమను మరింతగా అనుభూతి చెందుతుంది. హృదయం ఆ క్షణంలో పూర్తి తీవ్రతతో జీవించడం ప్రారంభిస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక కారణం ఏమిటి? వివరంగా తెలుసుకుందాం –

ఇవి కూడా చదవండి

హృదయం అనుభూతి చెందుతుంది జీతంలోని అన్ని అందమైన విషయాలను మనం కళ్ళు మూసుకోవడం ద్వారానే అనుభూతి చెందగలమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమించి, మొదటిసారి లేదా పదే పదే ముద్దు పెట్టుకున్నప్పుడల్లా.. ఆ క్షణంలో మీ కళ్ళు స్వయంచాలకంగా మూసుకుపోతాయి. ఇలా కళ్ళు ముసుకుకోవడం అలవాటు కాదు.. ఆ అనుభూతికి రుజువు. మనం మనకు నచ్చిన వ్యక్తికీ దగ్గరగా ఉన్నప్పుడల్లా.. ఆ వ్యక్తిని, ఆ క్షణం, ఆ సంబంధాన్ని చూసేది మన కళ్ళు కాదు మన హృదయం.

అందుకనే మనకు నచ్చిన వారు ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుపోతాయి. అప్పుడు బయటి ప్రపంచం పూర్తిగా మన దృష్టి పథం నుంచి అస్పష్టంగా మారుతుంది. ఎవరినీ పట్టించుకోము. ఆ సమయంలో ఈ ప్రపంచంలో ఉంది మీరు.. మీ భాగస్వామి మాత్రమే. ఈ ప్రత్యేక క్షణంలో ఒకరి శ్వాసను ఒకరు అనుభూతి చెందుతారు. అంతేకాదు స్పర్శను కూడా అనుభూతి చెందుతారు. ఈ సమయంలో ఏమీ మాట్లాడకపోయినా ఎన్నో మాట్లాడుకున్నట్లు అనుభవం కలుగుతుంది.

ఆనందం హార్మోన్ విడుదల అవుతుంది ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఆ క్షణంలో మీ భాగస్వామి మీకు మరింత దగ్గరగా ఉన్నట్లు అనిపించడం మొదలవుతుంది. ముద్దు పెట్టుకోవడం వల్ల సంతోషకరమైన హార్మోన్లు విడుదల కావడమే కాదు రెండు హృదయాలను మరింత దగ్గర చేస్తుంది.

లండన్ విశ్వవిద్యాలయంలోని రాయల్ హాలోవే శాస్త్రవేత్తలు కూడా దీనిపై ఒక అధ్యయనం చేశారు. దీనిలో మనుషులు కళ్ళు తెరిచి ఏదైనా తాకినప్పుడు.. దానిని దగ్గరగా అనుభవించలేమని వెల్లడించింది. అటువంటి పరిస్థితిలో భాగస్వాములు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నప్పుడు.. తాము ఆ అనుభూతిలో మునిగిపోవాలని కోరుకుంటారు. అందుకనే ముద్దు పెట్టుకునే సమయంలో కళ్ళు స్వయంచాలకంగా మూసుకుపోతాయని పేర్కొంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)