Personality Test: కాలి వేళ్ల ఆకారం ఆధారంగా ఆలోచనలు అలవాట్లు సహా వ్యక్తిత్వం తెలుసుకోండి..
ఒక వ్యక్తి శరీర ఆకృతి, అంటే వారి కళ్ళు, ముక్కు, ముఖం, కాళ్ళు, వేళ్ళు , పెదవుల ఆకారం ద్వారా కూడా మీ వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు ఇతరుల వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. వీటి ద్వారా మీలో దాగిన వ్యక్తిత్వాన్ని కూడా పరీక్షించుకోవచ్చు. అదేవిధంగా నేటి వ్యక్తిత్వ పరీక్షలో భాగంగా కాలి వేళ్ల ఆకారం ముందుకు తీసుకొచ్చాం.. మీ కాలి వేళ్ళ ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..

ముఖం ఆకారం, ముక్కు ఆకారం, వేళ్ల ఆకారం మొదలైనవి వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కొంతమందికి గుండ్రని ముఖం ఉంటుంది. మరి కొందరికి కోలాకరంలో ముఖం కలిగి ఉంటారు. కొంతమందికి చిన్న ముక్కు ఉంటుంది, మరికొందరు పెద్ద ముక్కు కలిగి ఉంటారు. ఈ విధంగా వివిధ విభిన్నమైన శరీర ఆకారాలు కలిగి ఉంటారు. వీటి ఆకారల ద్వారా కూడా మన వ్యక్తిత్వం, ఎవరికీ తెలియని రహస్య లక్షణాలు ఏమిటో మనం తెలుసుకోవచ్చు. కళ్ళు, ముక్కు, చెవుల ఆకారం ద్వారా వ్యక్తిత్వాన్ని పరీక్షించుకోవచ్చు. అదేవిధంగా నేటి వ్యక్తిత్వ పరీక్షలో కాలి వేళ్ల ఆకారం ఆధారంగా మీరు ఎలాంటి వ్యక్తి అనే విషయం తెలుసుకోండి.
మీ కాలి బొటనవేలు ఆకారం మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది:
ఈజిప్షియన్ పాదం: ఈ ఈజిప్షియన్ పాదం ఆకారంలో బొటనవేలు పొడవుగా ఉంటుంది. మిగిలిన వేళ్లు నిష్పత్తిలో తక్కువగా ఉంటాయి. మీ బొటనవేలు ఆకారం ఇలా ఉంటే.. మీరు లోతైన ఆలోచనాపరుడని అర్థం. ఈ రకమైన బొటనవేలు ఆకారం ఉన్న వ్యక్తులు ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఆధ్యాత్మిక, తాత్విక కార్యకలాపాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ప్రతిదానినీ గౌరవిస్తారు.
రోమన్ పాదం: ఈ పాదం ఆకారంలో బొటనవేలుతో సహా మొదటి రెండు వేళ్లు సమానంగా పొడవు ఉంటాయి. చివరి రెండు వేళ్లు చిన్నవిగా ఉంటాయి. ఈ రకమైన వేళ్లు ఉన్న వ్యక్తులు బలం, నాయకత్వ లక్షణాలు, న్యాయ భావం కలిగి ఉంటారు. న్యాయంగా వ్యవహరిస్తారు. తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి భయపడరు. వీరికి దృఢ సంకల్పం ఉంటుంది. అంతేకాదు వీరు మొండి పట్టుదలగలవారు కూడా.
గ్రీకు పాదం: ఈ పాద ఆకారంలో రెండవ వేలు బొటనవేలు కంటే పొడవుగా ఉంటుంది. ఈ వేలు ఆకారం ఉన్న వ్యక్తులు డైనమిక్ , శక్తివంతంగా ఉంటారు. వీరు కొత్త ఆలోచనలను చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, కొత్త వ్యక్తులను కలవడానికి , సవాళ్లను స్వీకరించడానికి ఆసక్తి కలిగి ఉంటారు. వారి అపరిమిత శక్తి , ఉత్సాహం వీరిని అద్భుతమైన ప్రేరేపకులు, స్ఫూర్తిదాయక స్నేహితులుగా చేస్తాయి.
జర్మన్ పాదం: ఈ పాదం ఆకారంలో బొటనవేలు పొడవుగా ఉంటుంది. మిగతా అన్ని వేళ్లు సమానంగా ఉంటాయి. ఇలాంటి వేళ్లు ఉన్న వ్యక్తులు ఆచరణాత్మకంగా , నమ్మదగినవారు. వీరు పరిష్కార నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా సులభంగా ఎదుర్కోగలరు. తమపై ఇతరులు నమ్మకం పెంచుకుంటే .. ఆ తర్వాత వారి పట్ల సంయమనంతో, విశ్వాసపాత్రంగా ఉంటారు.
సెల్టిక్ పాదం: ఈ పాద ఆకారంలో రెండవ వేలు బొటనవేలు కంటే పొడవుగా ఉంటుంది. చివరి రెండు వేళ్ళు సమానంగా ఉంటాయి. ఇలాంటి వేళ్లు ఉన్న వ్యక్తులు సృజనాత్మక, స్వతంత్ర వ్యక్తులు. వీరు అన్నింటికంటే స్వేచ్ఛను విలువైనదిగా భావిస్తారు. వీరు సృజనాత్మక వ్యక్తులు కూడా. వీరి ప్రత్యేకత, సృజనాత్మక వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)








