AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్.. బీట్‌రూట్‌ ఆకుల ఆరోగ్య బెనిఫిట్స్‌ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!

బీట్‌రూట్‌ మాదిరిగానే బీట్‌రూట్‌ ఆకుల్లో కూడా పోషకాలు అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు అని చెబుతున్నారు. బీట్‌రూట్ ఆకులలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పని చేస్తాయి. బీట్‌రూట్ ఆకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jul 11, 2025 | 5:30 PM

Share
బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బీట్‌రూట్‌ ఆకుల్లో కరిగే ఫైబర్‌, కరగని ఫైబర్‌ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ ఎ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

1 / 5
బీట్‌రూట్‌ ఆకులు తింటే వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలు తగ్గుతాయి. బీట్‌రూట్‌ ఆకుల్లో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్‌రూట్‌ ఆకుల్లో విటమిన్ సి కంటెంట్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

2 / 5
బీట్‌రూట్ ఆకులలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటంలో ఈ ఆకులు సహాయపడతాయి. ఐరన్‌ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించడంలో బీట్‌రూట్ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

3 / 5
బీట్‌రూట్ ఆకులలో నైట్రస్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్, ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీట్‌రూట్‌ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

4 / 5
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow Us