Viral Video: బద్దకానికి కేరాఫ్ అడ్రస్ ఈ మహిళ.. ఒకేసారి వారానికి సరిపడా వంటలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది..
అప్పట్లో స్త్రీలు చాలా చురుకుగా త్వర త్వరగా పనులు చేసుకునేవారు. అయితే నేటి మహిళలు మాత్రం అందుకు విరుద్ధం.. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీలు అయితే ఓ వైపు వంట చేయడం .. మరోవైపు ఆఫీస్ వర్క్.. దీంతో వంట చేయడం అంటే భారంగా భావిస్తున్నారు. మహిళలు సోమరితనంతో ఉంటున్నారు. తాజాగా ఒక సోమరి మహిళ 7 రోజులకు సరిపడా ఆహారం వండుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది

గత కొన్నేళ్ళ క్రితం వరకూ మహిళలు పనులు చేయడాన్ని కష్టంగా భావించే వారు కాదు. ఎన్ని పనులు ఉన్నా చాలా చురుగ్గా చేసుకునేవారు. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. దీంతో నిద్ర లేచింది మొదలు .. తమ కుటుంబ సభ్యులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం వంట చేసే సమయానికి భోజనానికి వచేవారు. కొంచెం సమయం విశ్రాంతి దొరికింది అనుకునే టైం కి రాత్రికి వంట చేయాల్సి వచ్చేది. ఈ రోజు అప్పట్లో స్త్రీలు చాలా చురుకుగా త్వర త్వరగా పనులు చేసుకునేవారు. అయితే నేటి మహిళలు మాత్రం అందుకు విరుద్ధం.. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్త్రీలు అయితే ఓ వైపు వంట చేయడం .. మరోవైపు ఆఫీస్ వర్క్.. దీంతో వంట చేయడం అంటే భారంగా భావిస్తున్నారు.
అంతేకాదు చాలా మంది మహిళలు సోమరితనంతో ఉంటున్నారు. ఇది వారి ఆరోగ్యంపై .. వారి కుటుంబంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. గతంలోలా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు.. కానీ సోమరితనం ఉంది. అందుకు నిదర్శనంగా నిస్తుంది ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో. అమెరికాలోని ఒక భారతీయ మహిళ ఒక వారానికి సరిపడా ఆహారాన్ని ఒక రోజులోనే వండుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ఈ వీడియో మాధవి అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 25 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల షేర్ చేసిన వీడియోలో ఒక మహిళ ఒక గంటలో ఏడు రోజులకు సరిపడా ఆహారాన్ని తయారు చేసింది. ఆమె దానిని రిఫ్రిజిరేటర్‌లో పెట్టింది. తనకు కావలసినప్పుడు ప్రిడ్జ్ నుంచి ఆ ఆహారాన్ని తీసి వేడి చేసి, తిన్న తర్వాత, తిరిగి రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతుంది. ఆమె 7 రోజులు ఇలా చేస్తుంది. ఇలా చేయడం ఒత్తిడిలో ఉన్న మహిళలు, ఉద్యోగ మహిళలు, విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె చెప్పింది. అయితే ఆమె చెప్పిన విషయాన్నీ ఎక్కువ గృహిణులు దీనిని వ్యతిరేకించారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు. ఇలా చేస్తే అమెరికాలో వంటవారి అవసరం ఉండదని వారు చెప్పారు.
వీడియోను ఇక్కడ చూడండి:
This meal prep creator got so much hate that she turned off comments ft @madhavis_little_nook byu/National_Holobird inInstaCelebsGossip
ఈ వీడియోలో ఆమె పాలక్ రోటీ, పనీర్ కాఠీ రోల్, దాల్ ఫ్రై, ఆలూ గోబీ, వెజ్ లసాగ్నా వంటి అనేక ఆరోగ్యకరమైన, శాఖాహార వంటకాలను తయారు చేస్తున్నట్లు చూపిస్తుంది. ఈ వంటలు ఏడు రోజులకు సరిపడా అని చెప్పింది. నెటిజన్లు ఆమెను సోమరి అని అన్నారు. తన కుటుంబ సభ్యులకు రోజూ తాజా ఆహారాన్ని ఎందుకు వండలేకపోతుంది అని ప్రశ్నించారు. మరికొందరు ఇటువంటి పద్ధతులు నిల్వ చేసిన ఆహారాన్ని తినడం వల్ల కలిగే అనేక నష్టాలను హైలైట్ చేస్తాయని చెప్పారు.
అమెరికాలో ఇది సాధారణమని.. ఒకరు అన్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే వ్యాఖ్యానించేవారిలో ఎక్కువ మంది బహుశా వంటగది ఎక్కడ ఉందో తెలియని పురుషులే అని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. తాజా ఆహారం కోరుకునే ప్రతి ఒక్కరూ, దయచేసి వెళ్లిమీరు సొంతంగా ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకోండి అని మరొకరు స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
