Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!
మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుందో, మన కళ్ళు ఎంత షార్ప్ గా చూస్తాయో తెలుసుకోవాలంటే.. ఇలాంటి ఆప్టికల్ పజిల్స్ పక్కా బెస్ట్ ఆప్షన్. చూడ్డానికి సింపుల్, సరదా గేమ్ లా కనిపించినా.. ఇవి మన ఆలోచనా శక్తిని ఇంకా పదునుగా మారుస్తాయి.

మన బుర్ర ఎంత బాగా పనిచేస్తుందో టెస్ట్ చేసుకోవడానికి ఈ ఆప్టికల్ పజిల్స్ బాగా పనిచేస్తాయి. సరదాగా అనిపిస్తాయి కానీ.. అసలు విషయం ఏంటంటే మన చూపు, ఫోకస్, గుర్తుపట్టే సామర్థ్యం అన్నీ దీంతో మెరుగుపడతాయి. ఇదో ఛాలెంజ్ అనుకోండి.. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మొత్తం కూడా 505 సంఖ్యలే కనిపిస్తున్నాయి కదా.. కానీ వాటి మధ్య రెండు 550 సంఖ్యలు కూడా దాగి ఉన్నాయి. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే.. కేవలం 10 సెకన్లలో వాటిని మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. మరీ రెడీనా మీరు.. అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే పాల్గొనండి.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ లు మన కళ్ళు ఎలా పనిచేస్తాయో చెప్పకనే చెబుతాయి. మన మెదడు ఒకేసారి చాలా విషయాలను చూడగలదు. కానీ కొన్నిసార్లు ముఖ్యంగా ఇలాంటి మాయా చిత్రాల్లో, మన మెదడే మనల్ని బోల్తా కొట్టిస్తుంది. ఎందుకంటే మనం చూసేదాన్ని మన మెదడు పాత అనుభవాల బట్టే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ జిత్తులమారి చిత్రాల్లో అసలు రహస్యం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది.

దీన్ని సైన్స్ భాషలో చెప్పాలంటే.. మన కళ్ళు సమాచారం పంపితే దాన్ని మెదడులోని నిర్ణయాలు తీసుకునే భాగం విశ్లేషిస్తుంది. కొన్నిసార్లు వీటికి మధ్యన కొద్దిగా టైమింగ్ మిస్సవుతుంది. అందుకే కొన్ని సమాధానాలు మన కళ్ళ ముందే ఉన్నా.. పట్టించుకోం. భలే ఉంటుంది కదా.
ఇంతకీ మీరు మీ టాస్క్ ని ఫినిష్ చేశారా..? ఫినిష్ చేయకుంటే టెన్షన్ పడకండి.. మీకోసం ఒక్క చిన్న క్లూ.. మొత్తం బొమ్మను స్కాన్ చేయొద్దు. ఎడమ వైపు కుడి వైపు చివరల్లో ఎక్కువ దృష్టి పెట్టండి. అక్కడే అవి దాగి ఉన్నాయి. ఇప్పుడు 550 సంఖ్యలను మీరు కనిపెట్టారా.. అయితే మీకు అభినందనలు.. మీరు అల్ట్రా స్మార్ట్.
కనిపెట్టలేకపోయిన వారు బాధపడకండి. ఎందుకంటే ఈ టైపు ఛాలెంజ్‌లు తెలివైన వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అంత సీరియస్ గా తీసుకోవద్దులేండి. మీకోసం నేనే వెతికిపెట్టాను చూడండి. చూసిన వెంటనే అరెరే ఇవి ఇక్కడే ఉన్నాయా.. అని అనిపిస్తుంది.

ఇలాంటి ఆప్టికల్ పజిల్స్ కేవలం సరదా ఆటలు మాత్రమే కాదు.. ఇవి మెదడుకు మంచి వ్యాయామం కూడా. పరిశోధనలు చెబుతున్నదేంటంటే.. తరచుగా ఇలాంటి పజిల్స్ లో పాల్గొనే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచనా శక్తి మరింత పదునవుతుంది, దృష్టి కేంద్రీకరణ మెరుగవుతుంది. ఈ ఆటను మీ స్నేహితులతోనూ పంచుకోండి. వాళ్ళలో ఎవరు త్వరగా 550లను గుర్తిస్తారో తెలుసుకోండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
