AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Shopping Scam: ఇన్‌ స్టాగ్రామ్ లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..?

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంత ఫాస్ట్‌ గా దూసుకెళ్తుందో.. ఆన్‌ లైన్ షాపింగ్‌ పై మనం కూడా అంతకు మించి డిపెండ్ అయిపోతున్నాం. ఇంట్లో కూర్చుని ఒక క్లిక్ చేస్తే చాలు.. పప్పు ఉప్పుల నుంచి లేటెస్ట్ ఫ్యాషన్ అవుట్‌ ఫిట్స్ దాకా అన్నీ డైరెక్ట్‌ గా డోర్ డెలివరీ. ఈ కంఫర్ట్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ చూసి చాలా మంది హ్యాపీగా షాపింగ్ చేస్తున్నారు. కానీ ఇదే కన్వీనియన్స్‌ ను అడ్డం పెట్టుకొని కొంతమంది ఫ్రాడర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ ద్వారా అమాయకులను ఈజీగా బుట్టలో వేసుకుని మోసం చేస్తున్నారు.

Instagram Shopping Scam: ఇన్‌ స్టాగ్రామ్ లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..?
Online Shopping Scam
Prashanthi V
|

Updated on: Jul 12, 2025 | 10:55 PM

Share

రీసెంట్‌ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో హైదరాబాద్ కి చెందిన ఓ అమ్మాయి సూపర్ డ్రెస్సులు చూసి అట్రాక్ట్ అయింది. వెంటనే అక్కడున్న వాట్సాప్ నంబర్‌ కు మెసేజ్ చేసింది. ఆ అవతలి వ్యక్తి డ్రెస్ బుక్ చేయాలంటే ముందు రూ.1000 పంపమని చెప్పాడు. పాపం ఆ అమ్మాయి నమ్మి ఫోన్ పే ద్వారా వెంటనే పంపింది. ఆ తర్వాత షిప్పింగ్ ఛార్జీలు అంటూ మరో రూ.700 అడిగారు. అది కూడా పంపింది. ఇలా విడతల వారీగా డబ్బులు తీసుకున్నాక.. మళ్ళీ డిస్పాచ్ ఛార్జ్ పేరుతో రూ.1500 పంపమని అడిగారు.

Mam Pay dispatch confirmation amount 1500 You have to pay dispatch charge only for 2 minutes Sir After 2 minutes your extra amount will be returned

ఇలా స్టెప్ బై స్టెప్ డబ్బులు అడుగుతున్న విధానం చూసి.. అమ్మాయికి సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపించింది. వెంటనే ఇంట్లో వాళ్లకి చెప్పగా ముందుగా ఇన్‌ వాయిస్ అడగమని సూచించారు. సరే అని ఇన్‌ వాయిస్ కావాలని అడిగితే అవతలి వాళ్ల నుంచి నో రెస్పాన్స్. పైగా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ అవ్వడానికి నాలుగు నెలలు పడుతుందని కండీషన్లు పెట్టారు. ఈ తతంగం చూశాక తను మోసపోయిందని ఆ అమ్మాయికి క్లారిటీ వచ్చింది. ఇలాంటి మాయ మాటలతో డబ్బులు దోచుకుంటారు. రోజు ఎవరో ఒకరు ఇలా ఫ్రాడర్స్ చేతులో మోసపోతున్నారు.

ఇలాంటి ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే ముందుగా కొన్ని కీ పాయింట్స్ పాటించాలి. ఎవరైనా డైరెక్ట్ మెసేజ్ చేసి ముందుగా పేమెంట్ అడిగితే అలర్ట్‌ గా ఉండాలి. ఏ వ్యాపారమైనా పక్కా వెబ్‌ సైట్, అడ్రెస్, జీఎస్‌టీ నంబర్ ఉన్న ఇన్‌ వాయిస్ ఇవ్వగలగాలి. అలా ఇవ్వలేకపోతే అది ఫేక్ బిజినెస్ అనుకోవాలి.

అలాగే సోషల్ మీడియాలో కనిపించే నకిలీ షాపింగ్ పేజీలను క్రాస్ చెక్ చేయకుండానే డబ్బులు పంపవద్దు. ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. ఒక్క రూపాయి పోయినా.. అది మన పర్సనల్ డేటాను మోసగాళ్లకు చేరవేసే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లో అధికారికంగా ఫిర్యాదు చేయాలి. లేదా దగ్గర్లోని సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌ లో కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇది చదివిన ప్రతి ఒక్కరూ దీన్ని చిన్న సంఘటనగా కాకుండా.. సీరియస్‌ గా తీసుకోవాలి. నాకేం కాదులే అనుకునే లోపే మోసం జరగవచ్చు. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనైనా డబ్బు ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడు డబుల్ చెక్ చేయాలి. మీ చుట్టూ ఇలాంటివి జరుగుతున్నాయంటే వెంటనే పోలీసులకు తెలియజేయండి.