Viral Video: చేపలు పడుతుండగా జలార్‌పై దూసుకొచ్చిన అనకొండ.. భయపడకుండా ఏం చేశాడంటే..
చిన్న పామును చూస్తేనే మనం ఆమడ దూరం పరిగెత్తుతాం.. అలాంటిది అనకొండ కనిపిస్తే ఇంకేమైనా ఉందా .. కానీ ఇక్కడో జాలర్ ధైర్యాన్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సందే.. ఎందుకంటే.. అతను నదిలో చేపలు పడుతుండగా సడన్‌గా ఒక పెద్ద అనకొండ కనిపించింది. అది ఆ జాలర్ పడవవైపు దాసుకురాగా అతను భయపడకుండా దాని తోకను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అది అక్కడి నుంచి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చిన్న పామును చూస్తేనే మనం ఆమడ దూరం పరిగెత్తుతాం.. అలాంటిది అనకొండ కనిపిస్తే ఇంకేమైనా ఉందా మరోసారి ఆ చుట్టుపక్కకు కూడా వెళ్లం. కానీ ఇక్కడో వ్యక్తి అనకొండను చూసి భయపడకపోగా.. ఏకంగా దాని తోకను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి అమెజాన్ అడవుల్లోని ఓ సరుసుల్లో చేపలు పట్టేందుకు తన చిన్న పడవను తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో అతనికి ఒక పెద్ద అనకొండ కనిపించింది. అది తన పడవైపు దూసుకొచ్చింది. దాన్ని గమనించిన ఆ జాలర్ భయపడకుండా తన పడవైపుకు వచ్చిన అనకొండ తోకను గట్టిగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దాని బలానికి జాలర్ పడవ అటు ఇటు ఊగిపోయింది.
Fisherman finds huge anaconda 🐍 pic.twitter.com/xiK4IZrqpK
— Terrifying Nature (@JustTerrifying) March 10, 2023
పడవ కిందపడిపోయే స్థితికి వచ్చినా జాలర్ మాత్రం ఆ అనకొండ తోకను వదిలిపెట్టలేదు. దీంతో అనకొండ అక్కడి నుంచి వెళ్లేందుకు తన శక్తమీర ప్రయత్నించింది. చివరకు అతనకు దాని తోకను వదిలేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ధైర్యానికి ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
