AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌లో ఇవేం పనులు మాస్టారు..? అది కూడా పిల్లల ముందే..

ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు తరగతి గదిలో ఆడుకుంటుండగా ప్రధానోపాధ్యాయుడు బెంచ్ మీద నిద్రపోతున్నారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

స్కూల్‌లో ఇవేం పనులు మాస్టారు..? అది కూడా పిల్లల ముందే..
Headmaster
SN Pasha
|

Updated on: Jul 13, 2025 | 8:38 PM

Share

బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని హయాఘాట్ ప్రాంతంలోని ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో నిద్రపోయాడు. విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి.. ఎంచక్కా.. క్లాస్‌ రూమ్‌లోనే కునుకుతీశాడు. హెడ్‌ మాస్టర్ పాఠశాలలోని బెంచ్ మీద గాఢ నిద్రలో నిద్రపోతున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

దర్భంగా జిల్లా హయాఘాట్ బ్లాక్‌కు చెందిన మజౌలియాలోని శివసింగ్‌పూర్‌లోని ఉపక్రమణిత్ అప్పర్‌ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నవల్ ఝా తరగతి గదిలో నిద్రిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధానోపాధ్యాయుడు బెంచ్ మీద గాఢ నిద్రలో నిద్రపోతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో చిన్న పిల్లలు తరగతి గదిలో ఆడుకోవడం, మాట్లాడుకోవడం చేస్తున్నారు.

ఈ వీడియో తీసిన అలోక్ చౌరాసియా మాట్లాడుతూ.. మేము మా స్కూల్ వెనుక ఉన్న మామిడి తోటను చూడటానికి వెళ్ళాం. హెడ్ మాస్టర్ స్కూల్ కి వచ్చి నిద్రపోతున్నట్లు నేను కిటికీ నుండి చూశాను. పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఆయన నిద్రపోవడంతో పిల్లలు స్కూల్‌ బయట కూడా తిరుగుతున్నారు. అందుకే నేను కిటికీ నుండి వీడియో తీశాను. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత టీచర్లు తనపై కోపంగా ఉన్నారని, తనను తిడుతున్నారని ఆయన అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్