AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pithru Dosham: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. వైశాఖ పౌర్ణమి రోజున ఈ చర్యలు చేయండి.. మీ పూర్వీకుల ఆశీస్సులు మీ సొంతం

ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి మే 12న వచ్చింది. ఈ వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. ఈ పౌర్ణమి రోజున ఎవరైనా తమ పూర్వీకుల ఆశీర్వాదం పొందలనుకుంటే కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. వీటిని పున్నమి రోజున చేయడం వలన మీపై మీ కుటుంబ సభ్యులపై మీ పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం.

Pithru Dosham: పితృ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. వైశాఖ పౌర్ణమి రోజున ఈ చర్యలు చేయండి.. మీ పూర్వీకుల ఆశీస్సులు మీ సొంతం
Pitru Dosham
Surya Kala
|

Updated on: May 07, 2025 | 6:19 PM

Share

హిందూ మతంలో పౌర్ణమి రోజున చేసే స్నానం, దానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. తిధుల్లో పౌర్ణమి తిధి కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి 2025 మే 12న జరుపుకుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ నివారణల చర్యలను చేయడం వలన మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని.. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం.

ఈ దిశలో దీపం వెలిగించండి.

హిందూ మతంలో దక్షిణ దిశను పూర్వీకుల దిశగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో పౌర్ణమి రోజున మీరు మీ పూర్వీకుల పేరుతో ఇంట్లోదక్షిణ దిశలో ఆవాల నూనెతో లేదా నువ్వుల నూనె తో దీపం వెలిగించవచ్చు. అలాగే మీరు మీ పూర్వీకులకు సంబంధించిన ఫోటోలను ఈ దిశలో పెట్టుకోవాలి. ఆ ఫోటోలకు దండ వేసి ఫోటో ముందు అగరబత్తి, దీపం వెలిగించి , దూపం వంటివి వెయ్యాలి. ఇలా చేయడం వలన కుటుంబంపై పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్ప్పుడూ ఉంటాయని నమ్ముతారు. వైశాఖ పూర్ణిమ రోజున సాయంత్రం స్నానం చేసి శుద్ధి చేసుకోండి. తర్వాత టెర్రస్‌పైకి వెళ్లి దక్షిణ దిశలో మట్టి దీపం వెలిగించండి. అలాగే మీ పూర్వీకులను తలచుకుని వారిని ధ్యానించండి. తెలియక ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని కోరుకోండి.

పూర్వీకులను ఎలా సంతోషపెట్టాలంటే

హిందూ మత విశ్వాసాల ప్రకారం పూర్వీకులు రావి చెట్టులో నివసిస్తారు. అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున మధ్యాహ్నం రావి చెట్టుకు నీళ్ళు అర్పించి, చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి. పరిక్రమ చేసిన తర్వాత చెట్టు ముందు ఆవాల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు ఆ నూనె లో ఛాయను చూసుకుని నీడను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ వారసులను ఆశీర్వదిస్తారు.

ఇవి కూడా చదవండి

పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి మంత్రాలు

ఓం నమః శివాయ

ఓం శ్రీ పిత్రాయ నమః

ఓం శ్రీ పిత్రదేవాయ నమః

ఓం శ్రీ పితృభ్యః నమః

ఓం శ్రీ సర్వ పితృ దేవతాభ్యో నమో నమః

ఓం శ్రద్ధా స్వధా నమః

ఓం శ్రీ సర్వ పిత్ర దోష నివారణ కోసం క్లేశం హున్ హున్ సుఖ శాంతిం దేహి ఫట్ స్వాహా

ఓం పితృదేవతాభ్యో నమః

ఓం పితృ గణాయ విద్మహే జగత్ ధారిణి ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
జ‌పాన్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మైన యానిమ‌ల్‌
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
మళ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రకుల్ ప్రీత్ బ్రదర్..
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్
కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్