AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్థరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తులు..

రంగురంగుల విద్యుత్ కాంతులతో శ్రీవారి ఆలయం పండుగ శోభను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటల నుంచి శ్రీవారి వైకుంఠద్వార దర్శనాన్ని...

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్థరాత్రి దాటిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తులు..
Tirumala
Ganesh Mudavath
|

Updated on: Jan 01, 2023 | 6:39 AM

Share

వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుగిరులు ముస్తాబయ్యాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో శ్రీవారి ఆలయం పండుగ శోభను సంతరించుకుంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.40 గంటల నుంచి శ్రీవారి వైకుంఠద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పండుగను పురస్కరించుకుని పుష్పాలతో తిరుమల పరిమళాలు వెదజల్లుతోంది. సోమవారం ఉదయం 5గంటల వరకు వీఐపీలకు, 5 నుంచి 6గంటల వరకు శ్రీవాణి భక్తులకు, ఉదయం 6గంటలనుంచి సామాన్య భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై మాడవీధుల్లో ఊరేగుతారు.

కాగా.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్దకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచే క్యూలైన్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూఇయర్‌, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు భారీగా వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే టిక్కెట్ల కోసం భారీగా క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం క్యూలైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, టికెట్ల జారీపై సరైన సమాచారం లేకపోవడంతో తోపులాట జరిగింది.

మరోవైపు.. తిరుమల వెంకటేశ్వరుడికి 2022 లో భారీగా ఆదాయం వచ్చింది. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు రూ.1,320 కోట్లు వచ్చిట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల సంఖ్య పెరగడంతో పాటు హుండీ ఆదాయం సైతం అదే స్థాయిలో పెరిగింది. కాగా.. కొత్త సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రానికి భారీగా భక్తులు తరలి రానున్నారు. దీంతో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Follow Us
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..