Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయంలో అక్షయ తృతీయ వేడుకలు.. ఘనంగా ధ్వజస్తంభం ప్రతిష్టాపన.. ఎత్తు ఎంతో తెలిస్తే..
ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో సీత, లక్ష్మణ, హనుమాన్, భరత, శతృఘ్న సమేతుడైన శ్రీరాముని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అక్షయ తృతీయ వేళ అయోధ్య రామమందిరంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన క్రతువు పూర్తి చేసినట్లుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 42 అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని వైశాఖ శుక్లపక్ష విదియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రతిష్టించినట్లు తెలిపారు. సంబంధిత ఫోటోలను ఇంటర్‌నెట్‌లో షేర్ చేయగా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వీక్షించారు.
రామ మందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తికానున్నట్లు వెల్లడించారు. రామ్‌దర్భార్‌లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈశాన్య ప్రాంతంలో శివాలయం, నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటికే అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో సీత, లక్ష్మణ, హనుమాన్, భరత, శతృఘ్న సమేతుడైన శ్రీరాముని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటీవలె అయోధ్యలో రామయ్య దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేలా 80 మీటర్ల పొడవున్న ఓ సొరంగాన్ని సిద్ధం చేశారు అధికారులు. ప్రదక్షిణ చేసుకునే భక్తులు, ఆలయానికి వచ్చే వారి మధ్య రద్దీ తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేల మట్టానికి దాదాపు 15 అడుగుల దిగువన 80 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించినట్లు చెప్పారు. ఈ సొరంగం గుండా ఒకేసారి 1.5 లక్షల మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు. దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించిన అతి పెద్ద సొరంగం ఇదేనని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..








