AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi Pachadi: ఉగాది పచ్చడి ఆంతర్యం .. ఆరు రుచుల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..!

ఉగాది అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్ప‌త‌నం అంతా ఉగాది ప‌చ్చ‌డి అంటే వేప పువ్వు పచ్చడిలోనే ఉంటుంది. ష‌డ్రుచుల స‌మ్మేళ‌నంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రయాణాలు అనేకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది ఋతు సంబంధ‌ పండుగ ..కనుక తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడిని తింటారు. 

Ugadi Pachadi: ఉగాది పచ్చడి ఆంతర్యం .. ఆరు రుచుల ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..!
Ugadi PacchadiImage Credit source: pexels
Surya Kala
|

Updated on: Apr 02, 2024 | 12:22 PM

Share

తెలుగు క్యాలెండర్ లో మొదటి రోజుని ఉగాదిగా తెలుగు వారు అత్యంత ఘనంగా జరుపుకుంటారు.  బ్రహ్మ సృష్టిని మొదలు పెట్టిన రోజు యుగానికి ఆది ఉగాదిగా భావించి చైత్ర మాసం పాడ్యమి రోజుని తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకుంటారు. హిందువులు జరుపుకునే అన్ని పండగలు చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి జరుపుకునేవే.. ఒక్క మకర సంక్రాంతి మినహా.. ఈ నేపథ్యంలో మనసుకు అధిపతి అయిన చాంద్రమానాన్ని అనుసరించి ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా జరుపుకునే మొదటి పండుగ‌ ఉగాది.

ఉగాది అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్ప‌త‌నం అంతా ఉగాది ప‌చ్చ‌డి అంటే వేప పువ్వు పచ్చడిలోనే ఉంటుంది. ష‌డ్రుచుల స‌మ్మేళ‌నంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యం పరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రయాణాలు అనేకం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది ఋతు సంబంధ‌ పండుగ ..కనుక తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడిని తింటారు.

ఉగాది పచ్చడి ఆంతర్యం

కొత్త సహస్రాబ్ధికి ప్రారంభ శుభ సూచకంగా భావించే ఉగాది నుంచి ఏడాది పొడుగునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను, ఆనందవిషాదాలను సమన్వయంతో, సానుకూల దృక్పధంతో స్వీకరించాలని తెలిజేసేదే ఉగాది పచ్చడి. షడ్రుచులు కలయిక వేప పువ్వు పచ్చడి. ఈ షడ్రుచుల పచ్చడిని తినడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడి మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి. తీపి సుఖ‌సంతోషాల‌ను, పులుపు  బాధ‌ల‌ను, ఒగ‌రు బంధాల‌ను ఇలా ప్ర‌తి ఒక్క ప‌దార్థం శ‌రీరానికి ప్ర‌కృతికి మ‌ధ్య బంధాన్ని తెలియ‌జేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆరు రుచులు ఆరు భావాలకు ప్రతీక

జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం.

ఆరు రుచులు ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలు

  1. వేప పువ్వు  మేలు పలు విధాలుగా ఉంటుంది. వేపపువ్వు చలవ చేస్తుంది.
  2. కొత్త బెల్లం ఆకలిని పెంచుతుంది
  3. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
  4. మిరియపు పొడి శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.
  5. మామిడి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది
  6. ఉప్పు మన జీర్ణశక్తిని పెంచి  ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఉగాది పచ్చడి తయారు చేసే విధానం:

ఒకటిన్నర కప్పు నీరు తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న వేప పువ్వులు, కొత్త చింత పండు గుజ్జు, బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు, తగినంత ఉప్పు, తగినంత మిరియాల పొడి వేసి కలపాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే