AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్భవతి అయిన సహోద్యోగికి విషం ఇచ్చిన కొలీగ్.. కారణం తెలిస్తే.. కోపాన్ని ఆపుకోవడం కష్టమేమో..

ఉద్యగస్తుల మధ్య సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉంటారు. అయినప్పటికీ తమ కొలీగ్ ను చంపాలని ఎవరూ ప్రయత్నం చేయరు.. ఇంకా చెప్పాలంటే అసలు అలాంటి దారుణమైన ఆలోచన కూడా చేయరు అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం చైనాలో ఒక ఆఫీసు లో జరిగిన వింత ఘటన నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు అసలు విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.. ఎటువైపు మనిషి పయనిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గర్భవతి అయిన ఓ స్త్రీకి ససహోద్యోగి విషయం ఇచ్చింది. అది కూడా గర్భవతి అయిన ఆ మహిళ ప్రసూతి సెలవుమీద వెళ్తుందని కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు చైనా సోషల్ మీడియా వెల్లడించింది.  

గర్భవతి అయిన సహోద్యోగికి విషం ఇచ్చిన కొలీగ్.. కారణం తెలిస్తే.. కోపాన్ని ఆపుకోవడం కష్టమేమో..
Chinese Woman
Surya Kala
|

Updated on: Apr 02, 2024 | 9:10 AM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో ఇంట్లో ఉండే సమయం కంటే ఆఫీసు లో ఉండే సమయానికి ప్రాధాన్యత పెరిగింది. తాము పని చేసే ఆఫీసులో సౌకర్యాలు, ఆఫీసు వాతావరణం బాగుండి పనికి తగిన జీతం ఇచ్చే సంస్థలో పని చేయాలనీ అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ ఒకే ఆఫీసులో దొరకడం కొంచెం కష్టమే.. మంచి జీతం ఉంటె ఆఫీసులో మంచి వెదర్ ఉండదు.. ఉద్యగస్తుల మధ్య సరైన అవగాహన లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఉంటారు. అయినప్పటికీ తమ కొలీగ్ ను చంపాలని ఎవరూ ప్రయత్నం చేయరు.. ఇంకా చెప్పాలంటే అసలు అలాంటి దారుణమైన ఆలోచన కూడా చేయరు అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం చైనాలో ఒక ఆఫీసు లో జరిగిన వింత ఘటన నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు అసలు విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా.. ఎటువైపు మనిషి పయనిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే గర్భవతి అయిన ఓ స్త్రీకి ససహోద్యోగి విషయం ఇచ్చింది. అది కూడా గర్భవతి అయిన ఆ మహిళ ప్రసూతి సెలవుమీద వెళ్తుందని కోపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు చైనా సోషల్ మీడియా వెల్లడించింది.  ఈ ఘటన  దావానలంలా దేశం అంతా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ యొక్క నివేదిక ప్రకారం సెంట్రల్ హుబేయ్ ప్రావిన్స్ లో ఒక మహిళా ఉద్యోగి .. గర్భవతి అయిన తన సహోద్యోగి తాగే నీటిలో అనుమానాస్పద పదార్థాన్ని కలిపింది. ఇదంతా అక్కడ డెస్క్ దగ్గర ఏర్పాటు చేసిన సెల్ లో రికార్డ్ అయింది. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నల్లటి దుస్తులు ధరించిన ఓ మహిళ .. తన కొలీగ్  డెస్క్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ ని ఓపెన్ చేసి.. ఆమె కంగారు కంగారుగా ఆ నీటిలో పౌడర్ లాంటి పదార్థాన్ని కలిపింది.

నీరు రుచి చూసి అనుమానంతో

ఇదేమీ తెలియని గర్భవతి అయిన యువతి తన డెస్క్ దగ్గర బాటిల్ లోని  నీరు తాగింది. అయితే ఆ నీరు  రుచి వింతగా ఉందని బాధిత మహిళ చెప్పింది. అయితే బహుశా ఆఫీసు నీళ్లలోనే ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చని భావించి.. కాచిన నీళ్ళు తాగడం మొదలు పెట్టినట్లు తెలిపింది. అయినప్పటికీ ఆ నీరు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. అప్పుడు ఆ గర్భవతి అయిన యువతికి తాను తాగుతున్న నీరు.. వాటర్ బాటిల్ పై అనుమానం వచ్చింది. తన వాటర్ బాటిల్ వాటర్‌ను ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తున్నారనే  అనుమానం కలిగి.. వీడియో తీయాలని నిర్ణయించుకుంది. తర్వాత  తన సహోద్యోగిని నీళ్లలో ఏదో వింత పదార్ధాన్ని కలుపుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గర్భవతి ఆ తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేసింది.

ఇవి కూడా చదవండి

పోలీసు విచారంలో నిందితురాలు చెప్పిన విషయం విని పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే గర్భవతి అయిన తన కొలీగ్ ప్రసూతి సెలవులు పెట్టుకుని వెళ్తే.. ఆ పని భారం మొత్తం తన మీద పడుతుందని.. అందుకనే తన కొలీగ్ ప్రసూతి సెలవు తీసుకోకుండా ఉండేందుకు ఇదంతా  చేసినట్లు వెల్లడించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us