AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Eclipse: సూర్యగ్రహణం సమయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లేకపోతే జీవితంలో సమస్యలు పెరుగుతాయి

2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న సంభవించనుంది. గ్రహణానికి 12 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణం సమయంలో అనేక విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. దీనితో పాటు గ్రహణ సమయంలో వచ్చే సూతకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

Solar Eclipse: సూర్యగ్రహణం సమయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. లేకపోతే జీవితంలో సమస్యలు పెరుగుతాయి
Solar Eclipse 2024
Surya Kala
|

Updated on: Apr 02, 2024 | 11:49 AM

Share

సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 9న మధ్యాహ్నం 2:22 గంటలకు ముగుస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణం సూత కాలం 12 గంటలు లేదా 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం సూత కాలం గ్రహణ సమయానికి 12 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూత కాలం ఒక విధంగా అశుభ సమయంగా పరిగణించబడుతుంది. కనుక సూతకాల కాలంలో ఎటువంటి శుభకార్యాలూ, పూజలను చేయరు. .

సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంటే 2024 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కెనడా, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, అరుబా, బెర్ముడా, కరేబియన్ నెదర్లాండ్స్, కొలంబియా, కోస్టా రికా, క్యూబా, డొమినికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఐస్లాండ్, జమైకా, నార్వే, పనామా, నికరాగ్వా, రష్యా, ప్యూర్టో రికో మార్టిన్ , స్పెయిన్, బహామాస్, యునైటెడ్ కింగ్‌డమ్, వెనిజులాతో సహా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.

సూర్య గ్రహణ సమయంలో ఏ  పనులు చేయకూడదంటే

  1. సూర్యగ్రహణం సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు లేదా సూర్యగ్రహణాన్ని నేరుగా  కళ్లతో చూడకూడదు.
  2. గ్రహణ సమయంలో వంటగదికి సంబంధించిన పనులు చేయకండి. ముఖ్యంగా ఆహారం వండకూడదు.
  3. గ్రహణ సమయంలో, గర్భిణీ స్త్రీలు ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు.  గ్రహణ సమయంలో సూది దారం ఉపయోగించరాదు.
  4. సూర్యగ్రహణం సమయంలో వేటినీ కత్తిరించవద్దు. గుచ్చడం లేదా గీరడం, కొట్టడం వంటి పనులు కూడా చేయడం నిషేధం
  5. గ్రహణ సమయంలో, ఎవరినీ బాధపెట్టవద్దు లేదా ఏ పేదవారిని వేధించవద్దు లేదా అవమానించవద్దు.
  6. గ్రహణ సమయంలో ఇంట్లో ఎవరితోనూ వాదించకండి. ఎందుకంటే గ్రహణ సమయంలో కుటుంబ సభ్యులతో వివాదాల వలన పూర్వీకుల ఆశీర్వాదం ఇవ్వరని నమ్మకం.
  7. గ్రహణ సమయంలో పూజా గదిలో లేదా దేవుడిని పూజించే చోట ఉంచిన విగ్రహాలను తాకవద్దు, పూజించవద్దు.
  8. గ్రహణ సమయంలో సూర్య భగవానుని ధ్యానిస్తూ.. సూర్య మంత్రమైన ” ఓం హ్రం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః : అని జపించండి. ఇలా 108 సార్లు జపించడం వలన విశేష ఫలితం కలుగుతుంది.

సూర్య గ్రహణం సూత కాలం

హిందూ మతంలో గ్రహణం సమయాని కంటే ముందు సూత కాలంగా పరిగణిస్తారు. ఈ సూత కాలం అశుభకరమైన  కాలంగా పరిగణించబడుతుంది. సూతకాల కాలంలో భగవంతుడిని పూజించరు లేదా ఏ శుభకార్యమూ చేయరు. అంతేకాకుండా ఆలయాల తలుపులు కూడా మూసి వేస్తారు. అంతేకాదు సూత  కాలంలో తినడం, త్రాగడం కూడా నిషేధించబడింది. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది.  గ్రహణం ముగిసినప్పుడు సూత కాలం కూడా ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు